* మూడు రాజధానులు పై మరో బిల్లు పెట్టొద్దు
అమరావతి బహుజన జెఎసిఅధ్యక్షులు పోతుల బాలకోటయ్య
ప్రజా రాజధాని అమరావతి మహాపాదయాత్ర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు, సిఆర్డీఎ రద్దు బిల్లును శాసనసభలో వెనక్కి తీసుకుంటూ మరోమారు మూడు రాజధానుల బిల్లును పెట్టబోతున్న ట్లు ప్రకటించటం హాస్యాస్పదం గా ఉందని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా వెంగమాంబ పురం, బంగారురాజు పల్లి, వెంకటగిరి లో జరిగిన మహా పాదయాత్ర లో పాల్గొని ప్రసంగించారు. రెండేళ్ల తర్వాత ప్రవేశపెట్టిన మూడు రాజధానులు బిల్లు సమగ్రంగా లేదని,రాజధానిలో భాగస్వాములైన రైతులతో చర్చించలేదని, ప్రభుత్వమే తనకు తాను మూడు రాజధానులు బిల్లును వెనక్కి తీసుకోవడం శుభ సూచిక మన్నారు. అయితే మళ్ళీ సమగ్రమైన మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు.
దేవాలయం లాంటి అసెంబ్లీలో వెనక్కి తీసుకున్న మూడు రాజధానులు బిల్లు పైన ముఖ్యమంత్రి కట్టుబడి ఉండాలని, మరో బిల్లు పెట్టొద్దని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే రాష్ట్రానికి రాజధాని లేఖ రెండున్నరేళ్లు గడిచిపోయిందని, రాజధానిని వివాదాస్పదంగా మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఆరోపించారు . ప్రధాని మోడీ ఏకవాక్య తీర్మానం తో మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో వెనక్కి తీసుకున్న రీతిలో ముఖ్యమంత్రి కూడా హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు . ఇప్పటికైనా రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి స్వయంగా స్పష్టమైన ప్రకటన చేయాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.
* ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనను మరువక ముందే అనంతపురం జిల్లాలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుమ్మగట్ట మండలంలోని గోనబావి వద్ద యాక్సిడెంట్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటో-కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
పూర్తి వివరాలు ఇలా.. బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన శేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కర్నాటకలోని ఉలిగికి దర్శనానికి వెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం రాయదుర్గం మీదుగా సొంతూరికి ఆటోలో వస్తున్నారు. గోనబావి సమీపంలోకి రాగానే. అదే గ్రామానికి చెందిన ప్రతాపరెడ్డి అనే వ్యక్తి కారు-ఆటో రెండు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. కోడిపల్లికి చెందిన శేఖర్ (26), కూతురు రక్షిత (5), పులకుంట గ్రామానికి చెందిన నాగమ్మ (60), పులకుంట గ్రామానికి చెందిన మహేంద్ర (4)గా గుర్తించారు. శేఖర్ భార్య రూపమ్మ, కొడుకు రాము (2), పులకుంటకు చెందిన లక్ష్మి, కారు ఓనర్ ప్రతాపరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
ఎస్సై తిప్పయ్య నాయక్ ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
* గుంటూరు జిల్లా//// మేడికొండూరు మండలం.
అవినీతిశాఖ వలలో మేడికొండూరు వీఆర్వో -1 కిషోర్ బాబు.
90 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కిన కిశోర్ బాబు.
మరణ ధృవీకరణ పత్రం తో పాటు కుటుంబ సభ్యుల ధృవపత్రం కోసం 90 వేలు డిమాండ్.
అనిశా అధికారులను ఆశ్రయించిన బాధితుడు మేడికొండూరు చెందిన షమీముల్లా.
* ● ఇండోనేషియా
|| అగ్నిపర్వతం పేలి లావా విరజిమ్మి.. 13 మంది మృతి ||
◆ ఇండోనేషియాలోని అతిపెద్ద అగ్నిపర్వతం మౌంట్ సెమెరు నుంచి లావా విరజిమ్ముతోంది.
◆ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మరణించారని , 90 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
◆ మరోవైపు వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు కాగా.
◆ శనివారం నుంచే 3 వేల 6 వందల మీటర్ల ఎత్తైన ఈ అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున బూడిద , పొగ వెలువడటంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.
* కృష్ణాజిల్లా:
మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో కలకలం.
తీవ్ర జ్వరం, జలుబు లక్షణాలతో ఒక రోజు 14 మంది ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిక ఆందోళనలో తల్లిదండ్రులు.
వయసుల వారీగా పిల్లలను వివిధ వార్డుల్లో చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.
రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపిన వైద్యులు.
* 7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ శంఖారావం.
విజయవాడ: ఈనెల 7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ శంఖారావం పూరించ నున్నారు.
ఉద్యోగుల సమస్యలపై కరపత్రాలు ఆవిష్కరించారు.
ఉద్యోగుల సమస్యలు సహా ఆందోళనపై కార్యాచరణ వివరిస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ 13లక్షల ఉద్యోగులను సమాయత్త పరిచేందుకు కార్యక్రమాలను చేపట్టామన్నారు.
2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయలేదన్నారు.
ఇప్పటి వరకు పీఆర్సీ రిపోర్టు బయటపెట్టలేదని, 7 పెండింగ్ డీఏలను నిలుపుదల చేసిన రాష్ట్రం ఏదీ లేదన్నారు.
డీఏ బకాయులను ఇవ్వని ఏకైక సర్కార్ ఎపీ ప్రభుత్వమేనని ఆరోపించారు.
సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు.
అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని ఆందోళనను కొనసాగిస్తామని విద్యాసాగర్ స్పష్టం చేశారు.
* అమరావతి/నెల్లూరు జిల్లా:
తిరుపతి సభకు అనుమతి ఇవ్వకపోతే.. హైకోర్టుకు వెళ్తాం.
అమరావతి రైతులు ఈనెల 17న ర్వహించబోయే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అమరావతి ఐక్య పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి తెలిపారు.
★ ఈనెల 17న తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించబోయే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అమరావతి ఐక్య పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి తెలిపారు.
★ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ ఇస్తే.. ఆంక్షలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ప్రత్యుత్తరం పంపినట్లు ఆయన పేర్కొన్నారు.
★ పాదయాత్రలో 42 కేసులు నమోదైనందున.. ఎందుకు అనుమతి ఇవ్వాలని ప్రశ్నించినట్లు శివారెడ్డి వెల్లడించారు.
★ పాదయాత్రలో నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని.. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లఘించలేదని వివరించారు.
★ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారానే అనుమతి తెచ్చుకుంటామని శివారెడ్డి స్పష్టం చేశారు..
* భారత్ -రష్యా బంధం సుస్థిరం మోదీ
దిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇక్కడకు రావడం భారత్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్-రష్యాల మధ్య సంబంధాల్లో ఎటువంటి మార్పూ రాలేదని ఉద్ఘాటించారు. సంక్షోభ సమయంలో వ్యాక్సిన్‌తో పాటు మానవతా సహాయంలో ఇరు దేశాలు పూర్తి సహకారం అందించుకున్నాయని నరేంద్ర మోదీ గుర్తుచేశారు.
ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ సందర్భంగా భారత ప్రధాని ఈ విధంగా మాట్లాడారు.
గడిచిన మూడు దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని, ఆ ఘనత మీకే చెందుతుందని పుతిన్‌తో మోదీ పేర్కొన్నారు. ఆర్థికరంగంలో సుదీర్ఘకాలంగా ఉన్న ఇరుదేశాలు సహకారాన్ని గుర్తుచేసిన మోదీ..
ఈ భాగస్వామ్య లక్ష్యాలను సాధించడంలో భాగంగా వ్యాపారవేత్తలను కూడా ప్రోత్సహించుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మార్పులు, మారుతున్న ప్రపంచ రాజకీయాలను ప్రస్తావించిన భారత ప్రధాని మోదీ.. ఇలాంటి ఎన్ని మార్పులు వస్తున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరంగా ఉన్నాయని అన్నారు.
భారత్, రష్యాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొనడంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగిన ఆయనకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతం పలికారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌కు చేరుకున్న ఇరువురు నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు.
* పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా సోమవారం కేంద్రం తేల్చిచెప్పింది.
సోమవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించారు. కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు.
బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యంతో పాటు కరోనా కారణంగా పోలవరం నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరిగిందని వెల్లడించారు. స్పిల్ వే చానల్ పనులు 88 శాతం పూర్తవగా, ఎప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనలు 73 శాతం, పైలెట్ చానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి తెలిపారు. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548.87కోట్లకు టీఏసీ ఆమోదించిన మాట వాస్తవమేనని, అయితే 2020 మార్చిలో సవరించిన అంచనాలపై ఆర్సీసీ నివేదిక ఇచ్చిందని, దాని ప్రకారం రూ.35,950.16 కోట్లకు మాత్రమే కేంద్రం అంగీకారం తెలిపిందని బిశ్వేశ్వర తుడు తన లిఖితపూర్వక సమాధానలో పేర్కొన్నారు.
* రైతుల నిరసన: రేపు కిసాన్ సంయుక్త మోర్చా కీలక సమావేశం
న్యూఢిల్లీ : సంయుక్త కిసాన్ మోర్చా కీలక సమావేశం మంగళవారం జరుగనున్నది. ఈ సందర్భంగా ఉద్యమ భవిష్యత్‌పై రైతు సంఘాల నేతలు ఉదయం 11 గంటలకు సమావేశమై చర్చించనున్నారు.
ఎంఎస్పీ, వ్యవసాయ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసుల ఉపసంహరణ సహా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఎస్కేఎం శనివారం ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో గత ఏడాది నవంబర్ 26 నుంచి దేశ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. అయితే, మిగతా డిమాండ్లను సైతం నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఐదుగురు సభ్యుల కమిటీ పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నది. గతంలో ప్రభుత్వంతో అనధికారిక చర్చలు జరిగాయి.
అయితే, కేసుల ఉపసంహరణ, ఎంఎస్పీపై చట్టపరమైన హామీతో సహా సమస్యల పరిష్కారానికి రాతపూర్వక హామీ కోరుకుంటున్నట్లు ఓ రైతు నాయకుడు పేర్కొన్నారు. శనివారం ఎస్కేఎస్ సమావేశమైన అనంతరం రైతు నాయకులు బల్బీర్‌సింగ్ రాజేవాల్, అశోక్ ధావ్లే, శివకుమార్ కక్కా, గుర్నామ్ సింగ్, యుధ్వీర్ సింగ్‌లను కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. గత నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 21న ఎంఎస్పీ, రైతులకు పరిహారం సహా ఆరు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ప్రధానికి రైతు సంఘాలు లేఖ రాసింది.
* ఆంగ్ సాన్ సూకీకీ నాలుగేళ్ల జైలు… అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో…?
యాంగోన్: ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి దేశ ప్రజలపై బలవంతపు అధికారాన్ని చెలాయిస్తున్న మయన్మార్ సైనిక ప్రభుత్వం వారి నిర్బంధలో ఉన్న కీలక నేతలను జైలుకు పంపే చర్యలను తీవ్రం చేశాయి.
ఇప్పటికే ఎన్నికల్లో కుట్ర, అవినీతి ఆరోపణలపై బహిష్కృత నేత ఆంగ్ సాన్ సూకీ కేసులు పెట్టి విచారిస్తుండగా.. తాజాగా రెండు అభియోగాలపై అక్కడి ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కోవిడ్ కాలంలో ప్రజల్ని రెచ్చగొట్టడం, కరోనావైరస్ నియంత్రణలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం 76 ఏళ్ల సూకీతోపాటు మరికొంత మంది నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ నేతలను నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఫేస్బుక్ పేజీలో ప్రజల్ని రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని, అలాగే గత నవంబర్ ఎన్నికల సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా వేలాది మందితో ప్రచారం నిర్వహించారని సైన్యం ఆరోపించింది.
* ప్రకాశం జిల్లా:
దర్శి మోడల్ స్కూల్ వద్ద విద్యార్థినుల ఆందోళన.
సరైన ఫుడ్ మెనూ పాటించడంలేదని కన్నీటి పర్యంతమైన విద్యార్థినిలు.
ఎన్ని సార్లు చెప్పినా వార్డెన్ మరియు సిబ్బంది పట్టించుకోవడంలేదని కన్నీటిపర్యంతమైన తల్లిదండ్రులు.