వారణాసి విశ్వేశ్వర ఆలయం నూతన హంగులను సంతరించుకుంటోంది చుట్టూ ఇరుకు సంధుల మధ్య గతంలో ఆలయంలోకి వెళ్లాలంటే భక్తులకు చాలా ఇబ్బందిగా ఉండేది ప్రధాని నరేంద్ర మోడీ కాశీ నుండి ఎంపీగా ఎన్నికైన అనంతరం వారణాసి రూపురేఖలను మార్చివేస్తున్నారు దీనిలో భాగంగా విశ్వేశ్వర ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి ని విస్తరించారు ఆలయం బయట లోపల భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మెరుగులు దిద్దుతున్న ఈ ఆలయం అందాలు చూసి ఆస్వాదించి ధరించాలంటే కాశీ ప్రయాణం పెట్టుకోండి మరి.