బాలీవుడ్ భామ, శ్రీలంక ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ముంబై విమానాశ్రయంలో షాక్ తగిలింది. ఇండియా నుంచి వెళ్తున్న జాక్వెలిన్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ సన‍్నిహితంగా దిగిన ఫొటోలు వైరల్ అవడంతో ఈ భామ చిక్కుల్లో పడింది. అప్పట్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంది. అప్పుడు సుఖేష్ చంద్రశేఖర్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్ కొట్టిపారేసింది. ఇది జరిగిన వారాలా తర్వాత సుఖేష్‌ను ముద్దు పెట‍్టుకుంటూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. అంతకుముందు ఈ రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్, నోరా ఫతేహి, సుఖేష్ చంద‍్రశేఖర్, అతని భార్య లీనా పాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. పలు నివేదికల ప్రకారం జాక్వెలిన్‌ను సుకేష్ నాలుగు సార్లు చెన్నైలో కలిశారని సమాచారం. అంతేకాకుండా ఆమె కోసం ప్రైవేట్ జెట్‌ను కూడా ఏర్పాటు చేశాడట. సుఖేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల బహుమతి పొందినట్లు ఈడీ విచారణలో తేలిందని సమాచారం. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ పిల్లితో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సుఖేష్ భార్య లీనా పాల్‌తో కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్‌తో పాటు నోరా ఫతేహీనికి కూడా సుఖేష్ భారీ బహుమతులు ఇచ్చాడట. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్‌తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం.
జాక్వెలిన్‌ను అడ్డుకున్న ముంబై విమానాశ్రయ పోలీసులు
Related tags :