DailyDose

TNI నేటి తాజా వార్తలు 7-Dec-2021

TNI నేటి తాజా వార్తలు 7-Dec-2021

* ?️?️?️?️?️?️

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

07-12-21 మంగళవారం

?️ నిన్న 06-12-2021 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 29,367.

?️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 15,119.

?️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.35 కోట్లు.

?సర్వేజనాః సుఖినోభవంతు ?

* ఇంచార్జి గోల
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసిన గౌరవ సభ ఆసక్తి కరంగా మారి వివాదం గా ముగిసింది. సభలో మాజీ కార్పొరేటర్ రామయ్య మాట్లాడుతూ నియోజకవర్గం ఇంచార్జ్ బొమ్మసాని సుబ్బారావు కు ఇవ్వాలని డిమాండ్ చేయటం జరిగింది. తర్వాత దళిత నాయకుడు డెవదానం మాట్లాడుతూ ఇక్కడ దళితులు ముస్లిం లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ముస్లిం సామాజిక వర్గ నాయకుడు నిత్యం ప్రజా సేవలో ఉండే ముహమ్మద్ ఫతాఉల్లాహ్ అన్ని విధాలుగా అర్హుడు అని చెప్పటం జరిగింది. ఇంచార్జి గా ఫతాఉల్లాహ్ ను నియమించాలని కోరటం జరిగింది.

దీంతో సభ ముగిసిన తర్వాత నాయకులు అందరు అసలు రామయ్య ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు అని మాట్లాడు కోవటం జరిగింది. పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని ఈ విషయం చూస్తున్నప్పడు ఇక్కడ ఈ మీటింగ్ లో ఈ విషయాలు ఎందుకు ఇప్పుడే గ్రూపులతో సతమత అవుతుంటే అని నాయకులు చెప్పుకోవటం జరిగింది.

* అమరావతి.

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.

సమావేశంలో భాగంగా వివిధ అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు సచివాలయాలు, ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్ ఇంకా ఏమన్నారంటే.

గ్రామసచివాలయాల్లో ఏటీఎం సేవలు.

– గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో ఏటీఎంలు పెట్టేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలి: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి.
ఇప్పటికే జగనన్న పాలవెల్లువ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది.

దీంతోపాటు రానున్న రోజుల్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ పనులు జరుగుతాయి.

దీనిద్వారా లావాదేవీల ప్రక్రియ కూడా జరుగుతుంది.

ఈ నేపథ్యలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌సేవలు విస్తృతం కావాలి.

ఏటీఎం సహా ఇతర ఆర్థిక కార్యకలాపాలకు వేదికగా మారాలి.

దీనివల్ల బ్యాంకింగ్‌ సేవలు వారి గ్రామంలోనే ప్రజలకు లభిస్తాయి.

గ్రామీణవ్యవస్థల్లో ఇదో గొప్పమార్పునకు దారితీస్తుంది.

ఆ దిశగా బ్యాంకులు ఆలోచన చేయాలి.

పైలట్‌ప్రాజెక్ట్‌గా కొన్ని కేంద్రాల్లో ప్రారంభించి, తర్వాత విస్తరిస్తామని తెలిపిన బ్యాంకర్లు.

ఇప్పటికే కొన్నిజిల్లాల్లో పైలెట్‌ప్రాజెక్టుగా ప్రారంభించామని తెలిపిన బ్యాంకర్లు.

* ?? Who Viewed My Facebook Profile: మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎవరు చూశారో తెలుసుకోండి ఇలా..??

? ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా వేదికలలో ఫేస్‌బుక్ ఒకటి. సోషల్ మీడియా ప్లాట్ ఫార‌మ్‌లలో ఫేస్‌బుక్ స్థానం ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ఈ ప్లాట్ ఫార‌మ్‌ను స్నేహితులతో చాట్ చేయడానికి, ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటానికి, వీడియోలను చూడటానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫేస్‌బుక్‌లో ప్రతి ఒక్కరికి తమ కంటూ ఒక ప్రత్యేక అకౌంట్ ఉంటుంది. దీనిని మనం ఫేస్‌బుక్ ప్రొఫైల్ అని కూడా పిలుస్తాము. దీని ద్వారా ప్రపంచంలోని ఇతర ఫేస్‌బుక్ ఖాతాదారులతో స్నేహం చేయవచ్చు.

ఇలాంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్లో మీ ప్రొఫైల్ ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. అయితే, సాధారణంగా మీతో స్నేహం చేయాలనుకునే వారు.. కొత్త స్నేహితాలను కనుగునే వారు ఫేస్‌బుక్ ప్రొఫైల్ చెక్ చేస్తారు. అయితే, మన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎంత మంది రోజు చూస్తున్నారో మనం తెలుసుకోవచ్చు, అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

? మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎవరు చూశారో ఎలా తెలుసుకోవాలి?

మీరు మొదట మీ ఫేస్‌బుక్ ఖాతాను డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ లో ఓపెన్ చేయండి.

ఇప్పుడు మీ ఫేస్‌బుక్ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ ఫేస్‌బుక్ సోర్స్ చూడటం కోసం ‘View Page Source’ మీద క్లిక్ చేయండి.

పేజీ సోర్స్ ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్+ఎఫ్(Ctrl+F) క్లిక్ చేయండి.

ఇప్పుడు, సెర్చ్ బార్ లో ‘BUDDY_ID’ టైప్ చేయండి.

మీకు ‘BUDDY_ID’ పక్కన అనేక ఫేస్ బుక్ ప్రొఫైల్ ఐడీలు కనిపిస్తాయి, ఆ ఐడీలను కాపీ చేయండి.

? ఇప్పుడు కొత్త ట్యాబ్ తెరిచి ఉదా:

‘Facebook.com/123456789123456’ అని టైపు చేయండి.

ఎవరో మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని చూశారో వారి ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ ఓపెన్ అవుతుంది.

ఇలా మొత్తం ఐడీలు నమోదు చేసి ఎంత మంది మన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని చూశారో తెలుసుకోవచ్చు.

?✒️??సత్యమేవ జయతే??✒️?

* ?? భారత్‌లో డెలాయిట్‌ ఏఐ ఇనిస్టిట్యూట్‌.. ఏఐ ఇంజినీర్లదే భవిష్యత్తు!?

? అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌. ఇప్పుడు ఈ సాంకేతికత హవా నడుస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో శాసించే టెక్‌ ట్రెండ్‌ కూడా ఇదే. ఈ మేరకు ఏఐపై పట్టుకోసం యువత తీవ్రంగా యత్నిస్తోంది. ఇదిలా ఉంటే భారత్‌లో ఇదివరకే కొన్ని విద్యాలయాలు, ప్రైవేట్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఏఐ టెక్నాలజీ కోర్సులను అందిస్తుండగా. తాజాగా డెలాయిట్‌ కూడా ఇందులోకి దిగింది.

ఫైనాన్షియల్‌ కన్సల్టెన్సీ కంపెనీ డెలాయిట్‌. పూర్తి స్థాయి ఏఐ ఆవిష్కరణల కోసం ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించుకుంది. ఏఐ సాంకేతికతపై ప్రాథమిక అవగాహన, ప్రతిభాపాటవాల ఆధారంగా ఎంపిక చేయబడ్డ వాళ్లకే ఈ ఇనిస్టిట్యూట్‌లో అడ్మిషన్లు దొరుకుతాయని డెలాయిట్‌ ఇండియా భాగస్వామి సౌరభ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇదిలా ఉంటే అమెరికాలో కిందటి ఏడాది డెలాయిట్‌ ఫస్ట్‌ ఏఐ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత కెనెడా, ఇంగ్లండ్‌, జర్మనీ, చైనా, ఆస్ట్రేలియాల్లో అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇనిస్టిట్యూట్‌లను నెలకొల్పింది.

? ఏఐ ఇంజినీర్లు కావలెను

ఎంఎన్‌సీ మొదలు.. చిన్నస్థాయి కంపెనీల దాకా(అందుబాటులో బడ్జెట్‌తో) ఏఐ మీదే ఆధారపడుతున్నాయి ఇప్పుడు. ఈ తరుణంలో ప్రజెంట్‌-అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీగా అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను పేర్కొంటున్నారు టెక్‌ నిపుణులు. ఇదిలా ఉంటే మన దేశంలో ఈ కోర్స్‌ మీద ఉద్యోగావకాశాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు కోర్సుపై పట్టు సాధించిన ఇంజినీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు వెస్ట్రన్‌ దేశాల్లో మాత్రం చాలా ఏళ్లుగా అవకాశాలు అందిస్తోంది. తాజాగా టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌.. ట్విటర్‌ ద్వారా జాబ్స్‌ ఆఫర్‌ చేశాడు. ఏఐ ఇంజినీర్లకు నియామకాలంటూ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నాడు. టెస్లాలో సాంకేతికతను విస్తరించడంలో భాగంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఓ ప్రకటనలోనూ ఆయన పేర్కొన్నాడు. అంతేకాదు ఏ దేశం వాళ్లకైనా ఈ నియామకాలు వర్తిస్తాయని స్పష్టత ఇచ్చాడు.

?✒️??సత్యమేవ జయతే??✒️?

* తెలంగాణలో టీఆర్ఎస్ ను తరిమికొడతాం.

ఈ మహోద్యమంలో ఉద్యమకారులంతా కలిసి రండి.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు.

జాతీయ నాయకుల సమక్షంలో బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న.

బీజేపీ తాడుతో కేసీఆర్ కుటుంబాన్ని గన్ పార్క్ కు కట్టేస్తా.

మైంహోం సిమెంట్ తో కేసీఆర్ ను రాజకీయ సమాధి చేసే వరకు ఉద్యమిస్తానన్న తీన్మార్ మల్లన్న.

• ప్రముఖ జర్నలిస్టు, తెలంగాణ కలం గొంతుక తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, నూనె బాలరాజ్ గౌడ్ తదితరుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మల్లన్నకు సభ్యత్వమిచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.

• తెలంగాణలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. హ్రుదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాం. మల్లన్న నిఖార్సయిన తెలంగాణ వాది, ఉద్యమకారుడు. రాజకీయ స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి రహితంగా ఉంటూ పేదల కోసం పాలిస్తుంటే. తెలంగాణలో అందుకు భిన్నంగా అవినీతి, రాక్షస, కుటుంబం పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి మల్లన్న.
• మల్లన్న తన కలంతో గళమెత్తుతుంటే జీర్ణించుకోలేని సీఎం కేసీఆర్ పోలీసు కేసులతో అనేక కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే మల్లన్నపై కేసీఆర్ అనేక నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి వేధించారు. అయినా వెరవని మల్లన్న తాను ఎంచుకున్న దారిలో వెళుతూ అమరవీరుల ఆశయం కోసం పోరాడుతున్నారు. మల్లన్నపై పదేపదే కావాలని కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. మల్లన్నను చూసి మేం బాధపడ్డాం. మలన్నకు అండగా నిలబడ్డాం. తెలంగాణలోని దుర్మార్గమైన పాలనను అంతమొందించాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తెలంగాణ ఉద్యమకారులు భావిస్తున్నారు. విఠల్, మల్లన్న వంటి నేతలకు రాజకీయ స్వార్థం లేదు. పోరాడే తెలంగాణ ఉద్యమకారులు, పోరాట పటిమ ఉన్న నేతలు. వారి లక్ష్యాలకు అనుగుణంగా బీజేపీ ఉద్యమిస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ, అవినీతి, నియంత ప్రభుత్వాన్ని తరిమితరిమి కొడతాం. కేసీఆర్ రాక్షస పాలనకు చరమగీతం పాడతాం. తెలంగాణ ఉద్యమకారులకు వేదిక బీజేపీ. బీజేపీ చేపడుతున్న ఈ మహోద్యమానికి మద్దతు పలకాలని రాష్ట్రంలోని తెలంగాణ ఉద్యమకారులను కోరుతున్నా.

*తరుణ్ చుగ్ మాట్లాడుతూ.

• బీజేపీలోకి జర్నలిస్టు తీన్మార్ మల్లన్న రాకను స్వాగతిస్తున్నాం. కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అరాచకాలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కలంతో కవాతు చేస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. లక్షలాది మంది యువత తీన్మార్ మల్లన్న యూ ట్యూబ్ ఛానల్ ను ఫాలో అవుతున్నారు. ఎమ్మెల్సీగా స్వతంత్ర్యంగా పోటీ చేస్తే 1.40 లక్షల ఓట్లకుపైగా సాధించి రెండో స్థానంలో నిలిచారు. పెద్ద ఎత్తున యువత ఓట్లేశారు. కలంతో గళం ఎత్తితే సహించలేని కేసీఆర్ సర్కార్ మల్లన్నపై అనేక కేసులు పెట్టి జైలుకు పంపింది. 9 సార్లు బెయిల్ వచ్చినా ఆయన బయటకు రాకుండా పదేపదే కేసులు పెట్టి జైలుకు పంపింది. మల్లన్నను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేసినా గ్రాడ్యుయేట్ యువత 1.40 లక్షల ఓట్లు వేసి రెండో స్థానంలో నిలిపారు. మల్లన్నను బీజేపీలోకి రావడంతో కేసీఆర్ సర్కార్ అవలంబిస్తున్న నియంత విధానాలు, దేశ ప్రజలకు మరోసారి చూపినట్లయింది. కేసీఆర్ నియంత, అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించేందుకు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ సర్కార్ పీఠం కదులుతోంది.

ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.

• తీన్మార్ మల్లన్న తెలంగాణలో పాపులర్ వ్యక్తి. ఇండిపెండెంట్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే 1.40 లక్షల ఓట్లకుపైగా సాధించి రెండో స్థానంలో నిలిచారు. మల్లన్నను ఓడించడానికి 100 కోట్లకుపైగా కేసీఆర్ ఖర్చు చేశారు. కేసీఆర్ నియంత, అవినీతి పాలనపై పోరాడుతున్న మల్లన్న బీజేపీలో చేరడాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాం.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.

• నేను జర్నలిస్టు కుటుంబం నుండి వచ్చిన. తీన్మార్ మల్లన్న అనే పేరును ప్రజలు పెట్టుకున్న పేరు. బీజేపీ ఈరోజు నాకు ఈ సభ్యత్వ తాడును ఇచ్చింది. ఈ సభ్యత్వ తాడుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని అమరవీరుల స్తూపానికి కట్టేయాలని బీజేపీలో చేరుతున్న. నా జీవితంలో మూడే మూడు లక్ష్యాలున్నయ్. అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి ఈరగోలలతో కేసీఆర్ కుటుంబం వీపు పగలగొట్టించడమే నా లక్ష్యం.

• సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత మోసకారి. తెలంగాణలో మీడియాను 100 కి.మీలలోతున పాతిపెడతానని చెప్పిన అహంభావి కేసీఆర్. అంతకంటే లోతున నిన్ను పాతిపెట్టే రోజులు వస్తాయని ప్రశ్నించిన తొలిగొంతు నాది. నాటి నుండి ఆ దిశగా పనిచేస్తున్న. అందుకే బీజేపీ ఇస్తున్న ఈ తాడుతో అమరవీరుల స్తూపానికి కట్టేసి కేసీఆర్ కుటుంబం వీపు పగలకొట్టిస్తా.

• నాపై కేసీఆర్ 38 కేసులు పెట్టించిండు. కేసీఆర్… ఏం సాధించావ్? నాపై కేసు పెడితే పోలీసోళ్లే బయటకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నరు. జడ్జీలు మథనపడ్డరు. కానీ చేతిలో అధికారం ఉందనే అహంకారంతో కేసులు పెట్టిండు. హుజూరాబాధ్ లో ఏమైంది? నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యినవో..అక్కడికే తీసుకొస్తా. నువ్వు 5 ఎకరాలతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించినవ్. మళ్లీ అక్కడికే తీసుకొచ్చే బాధ్యత మాది. ఈ విషయంలో బీజేపీ ద్వారా ప్రజల్లోకి ఉధ్రుతంగా తీసుకెళ్లే అవకాశం దక్కింది. కేసీఆర్ బరాబరా బాతాల పోశెట్టే. కేసీఆర్… తీన్మార్ మల్లన్నపై కేసులు పెడుతున్నా బాధపడత లేం. నువ్వు జర్నలిజం కుతికమీద కత్తిపెట్టినవ్. ఉద్యమకారుల మెడమీద కత్తి పెట్టినవ్. ఇప్పుడు వారంతా ఒక్కటవుతున్నరు. కేసీఆర్…. మైం హోం సిమెంట్ తీసుకొచ్చి నీకు రాజకీయ సమాధి కట్టడం ఖాయం.

* అఖండ సినిమాకు మూడు రోజులకు మొత్తం కలెక్షన్స్

నైజాంలో. రూ. 9.16 కోట్లు,
సీడెడ్‌లో రూ. 7.78 కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ. 2.87 కోట్లు,
ఈస్ట్ లో రూ. 2.40 కోట్లు,
వెస్ట్ లో రూ. 1.62 కోట్లు,
గుంటూరులో రూ. 2.71 కోట్లు,
కృష్ణాలో రూ. 1.66 కోట్లు,
నెల్లూరులో రూ. 1.41 కోట్లతో
రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 29.25 కోట్లు షేర్,

కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.55 కోట్లు రాబట్టింది. ఫలితంగా రూ. 35.40 కోట్లు షేర్, బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 35.40 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 18.60 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

* న్యూఢిల్లీ:

పారిశుధ్య కార్మికుల తరఫున లోక్ సభలో గళమెత్తిన విజయవాడ ఎంపి కేశినేని నాని ప్రశ్న.

దేశంలో ఎందరు పారిశుధ్య కార్మికులు ఉన్నారో అధికారిక గణాంకాలు ఉన్నాయా? ఉంటే రాష్ట్రాల వారీ సమాచారం, మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ ఎబాలిషన్ యాక్ట్ ,2013 ప్రకారం మాన్యువల్ స్కావెంజర్ పనిని నిషేధించలేకపోవడం నిజమేనా? పారిశుధ్య కార్మికుల పునరావాస పథకంలో ఎందరు ప్రయోజనం పొందారు? మంత్రిత్వశాఖ పారిశుద్ధ కార్మికుల డేటా బేస్ నిర్వహిస్తోందా, అయితే వివరాలు .. మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంకుల పరిశుభ్రతలో ప్రమాదాలు నివారణ చర్యలు ఏమిటి?

కేంద్ర మంత్రి గారి సమాధానం:

2013 మరియు 2018 సంవత్సరాలలో మాన్యువల్ స్కావెంజర్ల గుర్తింపు కోసం సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ రెండు సర్వేలను నిర్వహించి అర్హులైన 58098 మాన్యువల్ స్కావెంజర్లను గుర్తించడం జరిగింది.

పారిశుద్ధ్యం అనేది రాష్ట్రలకు సంబంధించిన అంశం అలాగే పారిశుద్ధ్య కార్మికుల సమాచారాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించదు.

మురుగు కాలవలు మరియు సెప్టిక్ ట్యాంక్ జరిగే ప్రమాదాలు భద్రత చర్యల కోసం ప్రతి మున్సిపాలిటి లో శానిటేషన్ రెస్పాన్స్ యూనిట్, మెకనైజెడ్ క్లినింగ్, ఆధునిక యంత్రాలు, పరికరాలు, శిక్షణ పొందిన కార్మికులను ఏర్పాటు చేశారు.
సెంట్రల్ సెక్టార్ సెల్ఫ్ ఎంప్లాయ్‌ మెంట్ స్కీమ్ కింద మాన్యువల్ స్కావెంజర్లకు అదనంగా, పారిశుధ్య కార్మికులు మరియు వారిపై ఆధారపడిన వారికి కూడా పునరావాస కార్యక్రమం క్రింద మూలధన సబ్సిడీ రూ. 5లక్షలు అందించడం జరుగుతుంది.

పారిశుద్ధ్య కార్మికుల కోసం స్వల్ప వ్యవధి శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది వారు సురక్షితమైన మరియు యాంత్రిక శుభ్రపరిచే పద్ధతులలో శిక్షణ పొందుతారు.

మాన్యువల్ స్కావెంజర్స్ కి ఆంధ్రప్రదేశ్ లో స్వయం ఉపాధి కింద మూలధనం పైన రాయితీ పొందినవారు 52 మంది,స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ పొందినవారు 252 మంది ఉన్నారు.

* ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.

తరుణ్ జోషి, ఐపిఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్, వరంగల్ మరియు సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియా వారి ఉత్తర్వుల ప్రకారం రోడ్ యాక్సిడెంట్ లలో మరణాలు లేదా ప్రమాదాలు నివారించేందుకు ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. దీనిలో భాగంగా ప్రతిరోజు కాజిపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో హెల్మెట్ గురించి ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించబడును. దానిలో భాగంగా ఈరోజు హన్మకొండ వడ్డేపల్లి జంక్షన్ నందు నోముల. ప్రభాకర్ రెడ్డి గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హమీద్ ఎస్సై గారు, ట్రాఫిక్ సిబ్బంది హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 100 కుపైగా ద్విచక్ర వాహనదారులను పట్టుకోవడం జరిగింది. వారందరూ హెల్మెట్ తీసుకొని వచ్చిన తర్వాత పైన్ లేకుండా వారి వెహికల్స్ అప్పగించడమైనది. కావున ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపవలెను. లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకోబడును. కాజీపేట ట్రాఫిక్ సీఐ ఈ సందర్భంగా అన్నారు.

* ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు “కోటి రూపాయలు” విరాళం ప్రకటించిన హీరో ప్రభాస్.

* ఢిల్లీ విమానాశ్రయం లో ప్రయాణికుల రద్దీ నివారణ కు టోకెన్ సిస్టమ్

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదేశం

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొవిడ్ పరీక్షాకేంద్రాల వద్ద ప్రయాణికుల రద్దీపై చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య స్పందించారు.

విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు జరిపేందుకు వీలుగా 120 రాపిడ్ పీసీఆర్ పరీక్షా యంత్రాలను ఏర్పాటు చేయించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రద్దీని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి జ్యోతిరాదిత్య విమానాశ్రయ అధికారులను ఆదేశించారు. కొవిడ్ టెస్టింగ్ కోసం టైమ్ స్లాట్ లను సూచించేలా టోకెన్ సిస్టమ్ ను ప్రవేశపెట్టాలని మంత్రి విమానాశ్రయ అధికారులకు సూచించారు.

ప్రయాణికులు సామాజిక దూరాన్ని పాటించడంతోపాటు మాస్కులు ధరించాలని మంత్రి కోరారు. ప్రయాణికులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి అదనంగా ఆర్టీపీసీఆర్ పరీక్షల కౌంటర్ల సంఖ్యను పెంచామని విమానాశ్రయం సీఈఓ విదేహ్ కుమార్ జైపురియార్ చెప్పారు. తాము ప్రయాణీకులకు మరింత సౌకర్యం కల్పించడానికి ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి పని చేస్తున్నామని, విమానాశ్రయంలోని వెయిటింగ్ ఏరియాలో ఫుడ్ కౌంటర్లు అందుబాటులో ఉంచామని జైపురియార్ చెప్పారు.