Movies

భారతీయుడిలోకి తమన్నా

భారతీయుడిలోకి తమన్నా

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా తమిళ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి పలు అవాంతరాలతో ఈ సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. వివాదాలతో లైకా ప్రొడక్షన్స్‌, శంకర్‌ కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు సినిమా షూటింగ్‌ మొదలుపెడదాం అనుకునేసరికి కమల్‌ హాసన్‌ కరోనా బారిన పడ్డారు. ఇటీవలె ఆయన కోలుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కాజల్‌ అగర్వాల్‌ రూపంలో మరో సమస్య వచ్చింది. ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు కాజల్‌ స్థానాన్ని భర్తీ చేయగల హీరోయిన్‌ కోసం చిత్రబృందం అన్వేషణలో పడింది. తొలుత ఈ పాత్ర కోసం త్రిషను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా తమన్నా పేరు తెరపైకి వచ్చింది. ఇందులో హీరోయిన్‌గా, వయసు మళ్లిన పాత్రలో కనిపించాల్సి ఉంది. తమన్నా అయితే రెండు పాత్రలకు న్యాయం చేస్తారని చిత్రబృందం భావించింది. తమన్నాకి కూడా పాత్ర నచ్చడంతో హీరోయిన్‌గా చేసేందుకు అంగీకరించారని కోలీవుడ్‌ టాక్‌. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు.