Fashion

ఇండియాలో హిందూ విడాకుల చట్టం ఇలా చెప్తోంది…

ఇండియాలో హిందూ విడాకుల చట్టం ఇలా చెప్తోంది…

హిందూ వివాహ చట్టం 1955లో వచ్చినప్పటికీ, ఈ చట్టం అమల్లోకి రాకముందు, వచ్చిన తరువాత జరిగిన వివాహములు రద్దు చేసుకుని విడాకులు కావాలని భార్య/భర్త కోర్టును కోరవచ్చును. కింద చెప్పబడిన కారణాల్లో ఏదో ఒక కారణం చేత విడాకులు కోరవచ్చును.
****కారణాలు
1. వివాహం తరువాత ఇతర స్త్రీలతో భర్త, ఇతర పురుషులతో భార్య వివాహేతరసంబంధాలు పెట్టుకు న్నపుడు.
2. వివాహం తరువాత ఫిర్యాదిని హింసకు గురిచేసినపుడు, ఈ హింస అనేది మానసికము, లేదా శారీరకం కావచ్చును.
3. విడాకుల పిటీషన్‌ కోర్టులో దాఖలు చేయుటకు ముందు పిటీషనర్‌ను ప్రతివాది అకారణంగా రెండేళ్లపాటు నిరాదరణకు గురిచేసినపుడు.
4. ప్రతివాది హిందూమతమును వదిలి మరో మతమును స్వీకరించినపుడు.
5. నయము కానటువంటి వ్యాధులతో బాధపడుతున్నపుడు.
6. అంటువ్యాధులు, సుఖరోగములతో ప్రతివాది భాదపడుతున్నపుడు.
7. సంసారం విడిచి ప్రతివాది సన్యాసిగా మారినపుడు.
8. ఏడేళ్లపాటు ప్రతివాది ఆచూకీ తెలియనపుడు
9. న్యాయబద్ధంగా వేర్పాటు డిక్రీ పొందిన తరువాత ఒక ఏడాదిపాటు భార్య భర్తల మధ్య దాంపత్య జీవితం లేనప్పుడు.
10. దాంపత్య హక్కుల పునరుద్దరణ కోరకు వేసిన కేసులో కోర్టువారు దాంపత్యమును కొనసాగించమని ఆదేశించినప్పటికీ ఏడాది వరకూ ప్రతివాది దాంపత్యమునకు రాకపోతే రానిచో విడాకులు తీసుకోవచ్చు.
**పరస్పర అంగీకారంతో విడాకులు
కింద చెప్పబడిన పరిస్థితుల్లో భార్యభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చును.
1. పిటీషన్‌ పెట్టే రోజుకు ముందు ఏడాదివరకూ ఇద్దరూ విడి విడిగా ఉంటున్నట్లు అయితే.
2. భార్యభర్తలు ఇద్దరూ కలిసి జీవించడం సాధ్యం కాదు అ ని నిర్ణయానికి వచ్చిన పుడు.సాధారణంగా వివాహం జరిగిన ఏడాదిలోపు విడాకులు కోరుతూ దరఖాస్తు చేయరాదు. అయితే అసాధారణ పరిస్థితుల్లో మాత్రం పెళ్లయిన ఏడాదిలోపు కోర్టు అనుమతితో విడాకుల పిటీషన్‌ వేయవచ్చును. భార్య భర్తలిద్దరూ కలిసి ఒక విడాకులు పిటీషన్‌ను సంబందిత కోర్టులో దాఖలు చేసుకోవలెను. విడాకుల పిటీషన్‌ కింద చెప్పబడిన ప్రదేశాలలో దాఖలు చేసుకోవచ్చును.
1. వివాహం జరిగిన ప్రాంతంలో
2. చివరిసారిగా భార్యభర్తలు కలిసి నివసించిన ప్రదేశంలో
3. ప్రతివాది నివసించుచున్న ప్రదేశంలో.
4. ప్రతివాది ఈ చట్టం అమలుగానీ ప్రదేశంలో నివసిస్తున్నపుడు పిటీషనర్‌ నివసిస్తున్న ప్రదేశం.
విడాకుల కేసుల్లో పార్టీల కోరికపై విచారణ రహస్యంగా జరుగుతుంది. విడాకుల కేసు విచారణ సమయంలో ఉన్నపుడు మనోవర్తి, మైనర్‌ పిల్లల చదువు ఖర్చు, పిల్లల సంరక్షణ, కోర్టు ఖర్చులు మొదలగువాటికి సంబంధించిన విషయములను కూడా విడాకుల పిటీషన్‌లో కోరవచ్చును. మనోవర్తిని ఒకే మొత్తములోగానీ, వాయిదాల పద్దతిలో (నెలవారీగా) చెల్లించాలని కోర్టువారు ఆదేశించవచ్చును.
ఇక మీ కేసులో మీరు ముందుగా ఒక లీగల్‌ నోటీస్‌ పంపించండి. అందులో అతను మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు, చెబుతూ అతనితో మీరు కలిసి ఉండడానికి ఎందుకు సుముఖంగా లేరో వివరించండి. దానితోపాటు పెళ్లి నిమిత్తం అయిన ఖర్చులు నష్టపరిహారంగా మీరు అడిగేది వివరిస్తూ సెటిల్‌మెంట్‌ కోసం ఒక నోటీస్‌ పంపండి. ఒకవేళ సెటిల్‌మెంట్‌ కాకపోతే మీరు 498 (ఏ), 3, 4 డీపీ యాక్ట్‌, మెయింటెనెన్స్‌ కేస్‌, గృహహింస కేసులు పెట్టవచ్చు. ప్రతికేసులో కూడా మధ్యర్తిత్వం ఉంటుంది. అంటే కేసును సెటిల్‌మెంట్‌ చేసుకోవడానికి రెండు పార్టీలకు ఒక అవకాశం ఇస్తారు. కాబట్టి మీరు భయపడకుండా చట్టాన్ని ఉపయోగించుకోండి.