* 13 న హాజరు కావాలని మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ కి నోటీసు లు ఇచ్చిన సీఐడీ
* టీటీడీ ఎడీ బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఎంఆర్ పల్లె పోలీసు మైదానంలో ఎప్ఎంఎస్ కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు.వీరి ఆందోళనకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మద్దుతు తెలిపారు.వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఎప్ఎంఎస్ కార్మికుల ఆందోళనను అడ్డుకున్నారు.అనంతరం వారిని బలవంతంగా అరెస్ట్ చేసి చంద్రగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
* నెల్లూరు జిల్లా..సంగం..7మందిని కాపాడిన పోలీసు సిబ్బంది.స్థానికులు, గజ ఈతగాళ్ళు, ఫైర్ సిబ్బంది సహకారంతో మిగిలిన వారికోసం గాలిస్తున్న పోలీసులు..రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సంగం వద్ద నెల్లూరు వైపు వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టగా, అందులో ఉన్న 12 మంది వాగులో పడిపోగా.. సంగం ఫ్శ్ శీ, వారి సిబ్బంది ఇప్పటి వరకు 7 మందిని కాపాడినట్టు జిల్లా పోలీసు కార్యాలయం తెలియచేసింది….సంఘటనపై నిత్యం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న జిల్లా ఉన్నతస్థాయి పోలీసు అధికారులు.
* మెక్సికోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 49 మంది వలసదారులు మరణించారు.వలసకార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కు రిటైనింగ్ గోడను ఢీకొని చియాపాస్‌లో బోల్తా పడిందని స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ దుర్ఘటనలో మరో 40 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ప్రాసిక్యూటర్ల ప్రాథమిక నివేదిక ప్రకారం యునైటెడ్ స్టేట్స్ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న అక్రమ వలసదారులకు గ్వాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన చియాపాస్ ప్రధాన రవాణా కేంద్రంగా మారింది.రాష్ట్ర రాజధాని టక్స్‌ట్లా గుటిరెజ్‌తో కలిపే హైవేపై వస్తుండగా ట్రక్కు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నట్లు తెలుస్తోంది.మృతులు ఏ దేశ జాతీయులు అనేది వెంటనే తెలియరాలేదు.
* రెండు ఇన్నోవాలతో సహా 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం పోలీసుల అదుపులో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు.- పట్టుబడిన స్మగ్లర్లలో చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండల జడ్పిటిసి భర్త మహేశ్వర్ రెడ్డి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం తెల్లవారుజామున రెండు ఇన్నోవాలతో సహా ఎర్రచందనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ముగ్గురు వ్యక్తుల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన స్మాగ్గర్లలో చంద్రగిరి నియోజకవర్గం, చిన్నగొట్టిగల్లు జడ్పిటిసి భర్త మహేశ్వర్ రెడ్డి, అతని అనుచరులు మునీశ్వర్, కృష్ణయ్య ఉన్నట్లు సమాచారం.అధికార పార్టీ నేత ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టుబడడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
* పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో దారుణం.ఆస్తి తగాదాల నేపథ్యంలో మరదల (పాలంకి భారతి)ను కత్తితో నరికి చంపిన బావ పాలంకి రామదాసు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మొగల్తూరు పోలీసులు