తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మూడు రోజుల అమెరికా ప్రయాణం గుట్టుగా సాగింది. Houstonలో నివసిస్తున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ రెండో కుమార్తె వివాహం గత వారాంతంలో జరిగింది. డాక్టర్ శ్రీనివాస్ చంద్రబాబు కుటుంబానికి అత్యంత ఆప్తులు. 2007లో చంద్రబాబు అమెరికా పర్యటన మొత్తం శ్రీనివాస్ విమానంలోనే జరిగింది. చంద్రబాబు అమెరికా వెళ్ళినప్పుడల్లా శ్రీనివాస్ ఆయన పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శ్రీనివాస్ కుమార్తె వివాహానికి నారా లోకేష్ తో పాటు ఆయన భార్య బ్రాహ్మణి కూడా హాజరయ్యారు. మొత్తం మూడు రోజులు మాత్రమే లోకేష్ అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉంటున్న తెదేపా నాయకులు కానీ కార్యకర్తల గాని లోకేష్ పర్యటనపై ఎటువంటి సమాచారం అందలేదు. చివరి నిమిషంలో ఒక్క వేమన సతీష్ మాత్రం ఆయనను కలిశారు.