బిపిన్ రావత్‌కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. ఆయనతో పాటు సైన్యంలో సేవలందించిన కల్నల్ (రిటైర్డ్ ) వీరేంద్ర ఎస్ తవాతియా రావత్ తో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. వీర సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, మాతా రాజ్యలక్ష్మి, సాయి దత్త పీఠం బోర్డు సభ్యులు, ఆలయ భక్తులు పాల్గొన్నారు.