అమెరికాకు చెందిన రామినేని ఫౌండేషన్ 22వ వార్షికోత్సవ పురస్కార ప్రదానోత్సవం 23వ తేదీన హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్ సెంటరులో నిర్వహిస్తున్నారు. 2020 విశిష్ట పురస్కారాన్ని నాబార్డు ఛైర్మన్ డా.జీ.ఆర్.చింతల, సోను సూద్, కనకాల సుమ, 2021 విశిష్ట పురస్కారాన్ని ఎల్లా కృష్ణ-సుచిత్ర, బ్రహ్మానందం తదితరులకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా ప్రదానం చేస్తారని ఫౌండేషన్ సమన్వయకర్త పాతూరి నాగభూషణం, ఫౌండేషన్ నిర్వాహకులు రామినేని ధర్మప్రచారక్‌లు తెలిపారు. ప్రముఖ కర్నాటక సంగీత గాయనీ అరుణ సాయిరాం సంగీత కచేరీ ఉంటుందని వీరు తెలిపారు.