DailyDose

95ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం-నేరవార్తలు-12/13

95ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం-నేరవార్తలు-12/13

* ఓ కామాంధుడు బరి తెగించాడు. 95 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు. మండలంలోని ఓ తండాలో మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం తండాకు చెందిన వృద్ధురాలి కుటుంబసభ్యులు కూలి పనులకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన 65 ఏళ్ల రామాంజులు నాయక్‌ మద్యం మత్తులో అత్యాచారయత్నం చేశాడు.
*కుత్బుల్లాపూర్ నగర శివార్లలోని సూరారంలో (Suraram) భారీ చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో సూరారంలోని కాశీవిశ్వనాథుని ఆలయంలో దుండగులు చొరబడ్డారు. ఆలయ తాళాలు పగలగొట్టి ఆరు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
*కస్టడీలో పలు కీలక విషయాలను వెల్లడించిన శిల్పా చౌదరి!
శిల్పా చౌదరిని పోలీస్ కస్టడీలో భాగంగా మూడు రోజులపాటు పోలీసులు ప్రశ్నించారు. ఇవాళ చంచల్‌గూడ జైలుకు తరలించారు. శిల్ప అకౌంట్లు, ఆస్తులపై పోలీసులు ఆరా తీశారు. కస్టడీలో శిల్ప పలు కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. కావాలనే కొంతమంది ప్రముఖుల్ని శిల్ప ఇందులోకి లాగినట్టు సమాచారం. మహిళా ఫ్లోరిస్ట్‌, ప్రతాప్‌రెడ్డి, మల్లారెడ్డిల పేర్లను ప్రస్తావించారు. తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఆమె ముగ్గురి పేర్లను చెప్పారు. డబ్బులకు సంబంధించి ఆధారాలను మాత్రం ఆమె చూపించలేకపోయారు. అయితే తమకే డబ్బులు ఇవ్వాలంటూ ఆ ముగ్గురు ప్రముఖులూ ఆధారాలను పోలీసులకు ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగానే ముగ్గురి పేర్లను పోలీసులకు శిల్ప చెప్పినట్టు తెలుస్తోంది. శిల్పకు ఇచ్చిన డబ్బులకు సంబంధించి.. చెక్కులు, వాట్సాప్‌ చాట్‌లను పోలీసులకు ఇచ్చారు. ఎన్నారై ప్రతాప్‌రెడ్డిని ఫోన్‌ ద్వారా పోలీసులు విచారించారు. మల్లారెడ్డితోపాటు ఫ్లోరిస్ట్‌ను విచారించారు.
*సెంట్రల్ కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా రంగ్రెత్ ఏరియాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు సోమవారనాడు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్న సమాచారంతో బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్చాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు తెలిపారు. దీనికి ముందు ఆదివారంనాడు అవంతిపోరలోని బారాగామ్ ఏరియాలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి.
*కడప జిల్లా ప్రొద్దుటూరులో యువకుడి ప్రాణాలను పోలీసులు కాపాడారు. చౌటపల్లి గ్రామానికి చెందిన సుబ్బరాయుడు తల్లి చెన్నమ్మతో గొడవపడ్డాడు. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆందోళన చెందిన తల్లి వెంటనే ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించే బ్లూకోల్ట్స్ సిబ్బందికి చరవాణి ద్వారా సమాచారం అందించారు.
*భువనగిరి కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో బుడిగే మహేశ్‌ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పు పెట్టుకోవడానికి యత్నిస్తుండగా కలెక్టరేట్‌ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. మహేష్ తండ్రి ఉప్పలయ్య ఆలేరు మండలం కొలనుపాకలో 20ఏళ్ల కిందట 4 ఎకరాల భూమిని రూ.6వేలకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోవడంతో మహేశ్‌ మనస్తాపం చెందాడు. దీంతో ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. అనంతరం అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి బాధితుడితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
*నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో గత మంగళవారం అర్ధరాత్రి ముగ్గురిని కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
*రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌లోని మియాపూర్‌- గండిమైసమ్మచౌరస్తా రహదారిలో బౌరంపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది.
*వరి సాగులో ఆశించిన దిగుబడి రాలేదు.. మిరప పంటకు తెగుళ్లు సోకటంతో నిరాశే మిగిలింది. మరో వైపు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఓ రైతును మనస్తాపానికి గురి చేయడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్‌ మండలం రోటిబండ తండా గ్రాయపంచాయతీ పరిధిలోని దూద్యతండాకు చెందిన రైతు ఆంగోతు బిక్య(50) తనకున్న రెండు ఎకరాల్లో వానాకాలం సాగులో అర ఎకరంలో వరి, ఎకరన్నర విస్తీర్ణంలో మిరప సాగు చేశారు.
*రైలు ఢీకొని పులి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని చలమ సమీప రైల్వేట్రాక్‌వద్ద పెద్ద పులి పట్టాలు దాటుతుండగా శుక్రవారం తెల్లవారుజామున రైలు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న కర్నూలు జిల్లా అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన పులి కళేబరాన్ని పరిశీలించారు.
*కడపలో రెండు ఏటీఎంలను పగులగొట్టి నగదు దోచుకెళ్లిన కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. కడప ఎస్పీ అన్బురాజన్‌ ఆదివారం విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు
*విజయవాడ నగరంలో వరుస చోరీలు జరుగుతున్నా నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. నగరంలో చోరీలు చేస్తున్న వారిని చెడ్డీగ్యాంగ్‌గా భావిస్తున్నా మని సీపీ కాంతిరాణా వెల్లడించారు. ఈ తరుణంలో సీపీ గుణదల, ఉప్పులూరు, మధురానగర్‌ రైల్వేస్టేషన్లలో డీసీపీ హర్షవర్థన్‌రాజు, అదనపు డీసీపీ బాబూరావు, క్రైం ఏసీపీ శ్రీనివాసరావుతో కలిసి తనిఖీ చేసినట్లు తెలిపారు. ఇక నగరంలో దొంగలను పట్టుకునేందుకు సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. అంతేకాక.. ఈ ముఠాలు చోరీలకు ఇతర నగరాలకు వెళ్లినప్పుడు శివారు రైల్వేస్టేషన్ల వద్ద, రైల్వే ట్రాక్‌లకు పక్కన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటాయని మధ్యప్రదేశ్‌ పోలీసులు వెల్లడించారు.
*కామవరపుకోట మండలం తడికలపూడి భారీ చోరీ ఇంటి వారందరు బంధువు లింట్లో పెళ్ళికెళ్ళిన సమయం చూసుకుని దొంగలు నగదు ; నగలు దోచుకున్న సంఘటన సోమవారం తెల్లవారుజామున తడికలపూడిలో వెలుగు చూసిన వైనం. ఆదివారం సాయంత్రం శుభకార్యానికి కుటుంబంతో కలిసి వెళ్లిన అత్యం వెంకటేశ్వరరావు కుటుంబం.. పెళ్లి నుండి ఈ ఉదయం తెల్లవారుజామున తడికలపూడి తిరిగి వచ్చిన కుటుంబం. బీరువాలు పగలకొట్టి ఉండటం, డబ్బు నగలు పోయినట్లు బాధితులు గుర్తింపు.తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించిన ఆగంతకులు… పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.. సి సి ఫుటేజ్ సంబంధించిన హార్డ్ డిస్కులు కూడా దుండగులు దోచుకెళ్లిన వైనం.. టీం , డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి తడికలపూడి పోలీసులు..రున్నర లక్షలు నగదు.. బంగారం 70కాసులు చోరీకి గురైన బాధితులు వెల్లడి.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
*వైసీపీ టీడీపీల మధ్య ఘర్షణ
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ తిక్కా రెడ్డి పై హత్య ప్రయత్నం. కోసిగి మండలం పెద్ద బొంపల్లి రథోత్సవంలో పాల్గొన్న తిక్కా రెడ్డి పై దాడి చేసేందుకు వైసిపి వర్గీయులు ప్రయత్నించారు తిక్క రెడ్డి వర్గీయులపై కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడి పలువురి గాయాలు 5 ఐదుగురికి పరిస్థితి విషమంగా ఉంది.
*ఉత్తరాఖండ్‌ జిల్లాల్లో కొండ ప్రాంతాలను వీడుతున్న ప్రజలు భారత సరిహద్దులకు సమీపంలో చైనా కొత్తగా గ్రామాలను నిర్మిస్తూ ప్రజలను తరలిస్తున్నట్లు చాలా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో భారత్‌ వైపు చైనా-నేపాల్‌ సరిహద్దుల్లోని గ్రామాలు ఖాళీ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దులను విడిచి ప్రజలు వలస వెళుతున్నారు. ఉత్తరాఖండ్‌లో పిథోరాగఢ్‌ జిల్లాలో చైనా-నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న 59 గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ఏ గ్రామం చూసినా మనిషి జాడ కనిపించే పరిస్థితులు లేవు. జల్‌ జీవన్‌ మిషన్‌ తాజా నివేదిక ప్రకారం.. పిథోరాగఢ్‌ జిల్లాలో ప్రస్తుతం 1,542 గ్రామాల్లోనే ప్రజలు ఉన్నారు. మూడేళ్ల క్రితం ఆ సంఖ్య 1,601గా ఉండేది. 59 గ్రామాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఇందులో పిథోరాగఢ్‌ తహసీల్‌లో 13, గంగోలీహాట్, డీడీహాట్, బెరీనాగ్‌ తాలుకాల్లో ఒక్కోదాంట్లో ఆరు, ధారచూలాలో 3, గణాఈ-గంగోలీ, ఫాంఖూ, థాల్‌లో 3 చొప్పున గ్రామాలు ఎడారిని తలపిస్తున్నాయి. ”మూడేళ్ల క్రితం గ్రామాల్లో 16వేల మంది జనాభా ఉండేది. 2019, 2020, 2021లో ఇంటింటి సర్వే చేపట్టాం. బ్రాహ్మణ క్షేత్రంలోని 1,601 గ్రామాల్లో సుమారు 40-50 గ్రామాలు గడిచిన మూడేళ్లలో దాదాపుగా ఖాళీ అయ్యాయి” అని జల్‌ నిగమ్‌ అధికారి రంజీత్‌ ధర్మసత్తూ తెలిపారు.