NRI-NRT

కెనడాలో తాకా క్రిస్మస్ ఉత్సవాలు

కెనడాలో తాకా క్రిస్మస్ ఉత్సవాలు

తాకా (తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా) డిసెంబర్ 11వ తేదీ, 2021 శనివారం నాడు ఘనంగా క్రిస్మస్ వేడుకలు కెనడాలోని మిస్సిసాగ నగరంలోని కెనెడియన్ కాప్టిక్ చర్చి నందు నిర్వహించారు. మొదటగా కెనడా మరియు భారత దేశ భక్తి గీతాలు ఆలపించి కార్యక్రమాన్ని రాణి మద్దెల మరియు ఆర్నాల్డ్ మద్దెల గారు ఆరంభించారు.తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను అందరినీ ఆహ్వానించి క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించారు. క్రిస్మస్ కెరోల్స్ మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో దాదాపు 3 గంటల పాటు ఉల్లాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. తాకా అధ్యక్షురాలు కల్పన మోటూరి అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి కోవిద్19 కష్ట కాలంలో తాకా చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరల,రాణి మద్దెల మరియు ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ్ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు ఇతర వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరిని అధ్యక్షులు కల్పన మోటూరి గారు అభినందించారు. చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, దాతలకు, అతిధులకు తాకా వ్యవస్థాపక కార్యవర్గ సభ్యులు శ్రీ అరుణ్ కుమార్ లయం ధన్యవాధములతో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.