* ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు.
* 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు వాహనం లో 34 ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకుని, వాహనం సహా ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లు ను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావుకు అందిన సమాచారం మేరకు డీఎస్పీ మురళీధర్, ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ సురేష్ బృందం ఆదివారం రాత్రి నుంచి అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు కూంబింగ్ చేపట్టారు
* మరో సలహాదారుడిని నియమించిన ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే షేక్ మహ్మద్ జియాద్దిన్ ని మైనార్టీ వెల్పేర్ సలహాదారుడిగా నియామకం. రెండేళ్ల పాటు సలహాదారు పదవిలో కొనసాగనున్న జియాద్దిన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన మైనార్టీ వెల్ఫేర్ శాఖ స్పెషల్ సెక్రటరీ
*ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ నిధుల మళ్లింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ కేసులో లక్ష్మీనారాయణ ఏ-2గా ఉన్నారు.. ముందస్తు బెయిల్ రావడంతో లక్ష్మీనారాయణకు ఊరట లభించినట్లయింది.. ఇక ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా వున్న ఘంటా సుబ్బారావును సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు.
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ వేశారు.
*తెలంగాణ రాష్ట్రంలో భారీఎత్తున ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 14న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుతో ఎన్నికల కోడ్ ముగియనుంది. ఆ వెంటనే ఉన్నతాధికారుల స్థానచలనాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.
*దేశంలో కొత్తగా 7350 కరోనా కేసులు (Corona cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,97,860కి చేరింది. ఇందులో 4,75,636 మంది మరణించగా, 3,41,30,768 మంది కరోనా నుంచి మరో 91,456 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 202 మంది మృతిచెందగా, 7973 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.
*భారతదేశంలోనే గ్రామ పరిపాలనలో సర్పంచ్ పదవికి ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజస్థాన్లో మొట్టమొదటిసారిగా 1957వ సంవత్సరంలో గ్రామ పంచాయతీ పాలన ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు కూడా సర్పంచ్ పదవికి ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.
*నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ముగిసిన చంద్రబాబు సమీక్ష నెల్లూరు నేతల పని తీరుపై సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చంద్రబాబు నెల్లూరు నగర పార్టీ డివిజన్ కమిటీలు అన్ని రద్దు చేసిన చంద్రబాబు త్వరలో నెల్లూరు నగర పార్టీకి కొత్త కమిటీ ఏర్పాటు చేస్తానని ప్రకటన నగర నేతలు అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పనితీరుపై అసంతృప్తి ఇద్దరు నేతలు పనితీరు మార్చుకోక పోతే కఠిన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరిక.
*విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ కొట్టివేత విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ కొట్టివేత జగనన్న విద్యాదీవెన పథకంపై గత తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్mతల్లుల ఖాతాల్లో నగదు జమచేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేసిన హైకోర్టు . హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ రివ్యూ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తుది తీర్పు. ప్రభుత్వ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ప్రైవేటు యాజమాన్యాల పిటిషన్. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్.