తిరువూరు వాహినీ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనలియర్ ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్ధి వెలమాటి నాగ భరత్ కు అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ “తానా” నుండి చేయూత లభించింది. తానా ఫౌండేషన్ ట్రస్టీ సామినేని రవి చేతుల మీదగా మంగళవారం నాడు రూ. 50 వేలు విలువైన లాప్ టాప్ ను భరత్ కు తిరువూరులో అందజేశారు. ఈ సందర్భంగా సామినేని రవి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధులకు, మెరిట్ విద్యార్ధులకు తానా ద్వారా లాప్ టాప్ లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కిలారు ముద్దుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తిరువూరు విద్యార్ధికి తానా చేయూత
Related tags :