చావు డప్పు కొట్టించారు..ముఖ్యమంత్రికి అసలు సిగ్గుఉందా..?: డీకే అరుణ
ఢిల్లీ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ……..
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో ఉన్నారో లేదో తెలుసుకోకుండానే మంత్రులు ఢిల్లీకి వచ్చారా అంటూ విమర్శించారు.చావు డప్పు కొట్టించారు ముఖ్యమంత్రికి అసలు సిగ్గుఉందా అంటూ ప్రశ్నించారు. రైతులు ఆందోళన చెందద్దని చెప్పిన సీఎం కేసీఆర్, పూటకో మాట మారుస్తూ వరి వేస్తే ఉరి’ అని రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలనే సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదన్నారు.
హుజురాబాద్ లో బీజేపీ గెలిచిన తర్వాత కేసీఆర్‌కి మతి చెలించిందన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయామనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నారని డీకే అరుణ ఆరోపించారు. కేంద్రమంత్రుల పై బూతులు మాట్లాడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ధాన్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసీఆర్ ఎందుకు రైతుకు అండగా ఉండడం లేదు. ‘రైతు బంధు’ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు.ఢిల్లీకి వచ్చిన మంత్రులు సేద తీరుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కార్యాలయం నిర్మాణం పై తిప్పలు పడుతున్నారు. రైతులను మోసం చేసే డ్రామాలు బంద్ చేయాలి.
కేంద్రం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ తన విధానాన్ని మార్చుకోవాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీఎం ఏది చెప్పితే, మంత్రులు కూడా అదే మాట్లాడుతున్నారు.గ్రౌండ్ రియాలిటీ తెలియదా మంత్రులకు అంటూ ప్రశ్నించారు. ఏ మొఖం పెట్టుకొని మంత్రులు ఢిల్లీకి వచ్చారు. సీఎంకి ఎవరైనా లేఖ ఇస్తే తీసుకుంటారా? ఎవరికైనా ప్రజా సమస్యల పై సమయం ఇచ్చారా.? అని కేసీఆర్‌ను డీకె అరుణ నిలదీశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు డీకె అరుణ చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అమిత్ షా చెప్పారని డికె అరుణ అన్నారు.