పెన్ను 70 ఏండ్లు రాయడం ఏంటీ అనుకొంటున్నారా? అవును మీరు చదువుతున్నది నిజమే. ఈ అరుదైన పెన్నుతో 60 నుంచి 70 ఏండ్ల పాటు రాసినా సిరా తగ్గదు. -30 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రత ఉన్నా, +260 డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత ఉన్నా ఈ పెన్నుతో భేషుగ్గా రాయొచ్చు. అంతరిక్షంతో పాటు ఏ వాతావరణంలోనైనా, ఏ కోణంలోనైనా ఉపయోగించవచ్చు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న పుస్తకప్రదర్శనలో ఈ అరుదైన కలం అందరినీ ఆకట్టుకొంటున్నది. 25 ఏండ్ల నుంచి చేతి రాతపై శిక్షణ ఇస్తున్న నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ ఈ స్పేస్ పెన్ (ఇన్ఫీనియం)ను సేకరిం చి ప్రదర్శనలో ఉంచింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ పెన్ను ధరెంతో తెలుసా? రూ.13, 150. బుక్ ఫెయిర్‌లోని 225వ నంబర్ స్టాల్‌లో అందుబాటులో ఉంచినట్టు అకాడమీ ప్రతినిధి మల్లికార్జున్‌రావు తెలిపారు.