ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఆట వేడుకలలో భాగంగా గురువారం నాడు హైదరాబాదులోని టీ హబ్ లో వాణిజ్య సదస్సును నిర్వహించారు. ఆటా అధ్యక్షుడు భువనేష్ భుజాల, తదుపరి అధ్యక్షురాలు మధు బొమ్మినేని తదితరుల ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు. తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, ప్రముఖ ఐటీ నిపుణులు JA చౌదరి, చారు శ్రీనివాస్, కాజా రమేష్, నిరంజన్, ప్రకాష్ బత్తిన తదితరులు పాల్గొన్నారు.