ఇవి తప్పవు!
* స్వెటర్ వేసుకొని పడుకోవడం వల్ల వెచ్చదనం మరీ ఎక్కువై రాత్రుళ్లు చెమటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇది రక్తపోటు పడిపోవడానికీ కారణం కావచ్చు. ఇలా ఒకేసారి రక్తపోటు పడిపోవడమనేది మంచి సంకేతం కాదంటున్నారు నిపుణులు.
* అంతేకాదు.. ఇలా స్వెటర్ వేసుకొని పడుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత బయటికి వెళ్లిపోకపోవడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు నిపుణులు. తద్వారా తల తిరగడం, మైకం, అలసట.. వంటివి తలెత్తుతాయట.
* గుండె సంబంధిత సమస్యలున్న వారు, మధుమేహులు పడుకునేటప్పుడు స్వెటర్ వేసుకోకపోవడమే మేలంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల చర్మానికి గాలి తగలక.. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందట!
* శీతల గాలులు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. వీటి నుంచి రక్షించుకోవడానికి రాత్రింబవళ్లూ స్వెటర్ వేసుకొనే ఉంటాం. అయితే దీనివల్ల చర్మం పొడిబారే సమస్య అధికమవుతుందంటున్నారు నిపుణులు. తద్వారా అలర్జీ, ఎగ్జిమా.. వంటి చర్మ సంబంధిత సమస్యలకు దారితీయచ్చు.
* స్వెటర్ వేసుకొని పడుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. తద్వారా ఊపిరి అందకపోవడం, మైకంగా అనిపించడం.. వంటి సమస్యలొస్తాయి.
* ఒంటికి స్వెటరే కాదు.. కాళ్లకు సాక్సులు, చేతులకు గ్లౌజులూ ధరించే వారు లేకపోలేదు. దీనివల్ల చెమటలొచ్చి బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు దాడిచేసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే కాళ్లు, చేతులకు ఎంతగా గాలి తగలనిస్తే అంత మంచిది.