క్రిస్‌మస్, నూతన సంవత్సరం బహుమతిగా రూ.20 వేలు ఇస్తామంటూ తమ సంస్థ పేరిట కొందరు వాట్సాప్‌లో లింకులు షేర్ చేస్తున్నారని, దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని రామ్‌రాజ్ కాటన్ స్పష్టం చేసింది. సంస్థ పేరు చెడగొట్టాలన్న దురుద్దేశంతో ఆఫర్ల పేరిట సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ లింకుల్ని ఇతరులకు షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. రామ్‌రాజ్ కాటన్ పేరిట చట్టవ్యతిరేక పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తప్పుడు లింకుల ద్వారా హ్యాకర్లు వినియోగదారుల చరవాణిల్లోని సమాచారాన్ని దొంగిలించే ప్రమాదముందని పేర్కొంది.