ScienceAndTech

వాట్సాప్ ద్వారా బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు

వాట్సాప్ ద్వారా బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందికి చేరువైన వాట్సాప్‌.. కేవలం మెసేజింగ్‌ సర్వీసులే కాక ఆర్థిక సేవలనూ అందిస్తోంది. వాట్సాప్ నుంచి డ‌బ్బు బ‌దిలీ చేయ‌డంతో పాటు బ్యాంకు ఖాతా బ్యాలెన్స్‌ చెక్ చేసుకునే స‌దుపాయాన్ని కల్పిస్తోంది. బ్యాంకు నుంచి బ్యాంకుకి డ‌బ్బు బ‌దిలీ చేసేందుకు వాట్సాప్‌ యూపీఐ (యూనిఫైట్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్) సిస్ట‌మ్‌ని ఉప‌యోగించుకుంటుంది. ఇది గూగుల్‌పే, ఫోన్‌పే మాదిరిగానే ప‌నిచేస్తుంది. ఫోన్ నంబర్‌ సాయంతో బ్యాంకు వివ‌రాల‌ను గుర్తిస్తుంది. అందువ‌ల్ల వ్యాట్సాప్ పేమెంట్ సిస్ట‌మ్ సేవ‌లు పొందాలంటే ముందుగా మీ బ్యాంకు ఖాతాకు మొబైల్ నంబర్‌ను అనుసంధానించాలి. అలాగే మీ వాట్సాప్ యూపీఐ పేకి బ్యాంకు ఖాతాను రిజిస్ట‌ర్ చేయాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట‌ర్ చేసుకున్న వారు వాట్సాప్‌ ద్వారా ఖాతా బ్యాలెన్సును రెండు విధాలుగా తెలుసుకోవ‌చ్చు.

ఒకటో పద్ధతి

* ముందుగా వాట్సాప్‌ను తెరిచి మీరు ఆండ్రాయిడ్ డివైజ్‌ను ఉప‌యోగిస్తుంటే మోర్ ఆప్ష‌న్‌లోకి.. ఐఫోన్ యూజ‌ర్లు సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

* అక్క‌డ అందుబాటులో ఉన్న పేమెంట్స్ ఆప్ష‌న్‌పై ట్యాప్ చేయాలి.

* పేమెంట్స్ మెథ‌డ్‌లో బ్యాంకు అకౌంట్‌ను క్లిక్‌ చేసి వ్యూ అకౌంట్‌ బ్యాలెన్స్‌పై క్లిక్ చేయాలి.

* ఆపై యూపీఐ పిన్ ఎంట‌ర్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌చ్చు.

రెండో పద్ధతి..

* డబ్బులు పంపేటప్పుడు వచ్చే పేమెంట్ నోటిఫికేష‌న్ స్క్రీన్‌పై మీరు ప్రాధాన్య‌త‌నిచ్చే పేమెంట్ ఆప్ష‌న్‌ను ట్యాప్ చేయాలి.

* ఇక్క‌డ వ్యూ అకౌంట్‌ బ్యాలెన్స్‌పై క్లిక్‌ చేయాలి.

* మీ వాట్సాప్‌ నంబర్‌ ఒక‌టి కంటే ఎక్కువ ఖాతాలు అనుసంధానించి ఉంటే వాటి జాబితా క‌నిపిస్తుంది.

* మీరు ఏ ఖాతాకు సంబంధించిన బ్యాలెన్స్ తెలుసుకోవాల‌కుంటున్నారో ఆ బ్యాంకు ఖాతాను ఎంచుకుని యూపీఐ పిన్ ఎంట‌ర్ చేస్తే బ్యాలెన్స్ క‌నిపిస్తుంది.