టాంపాబే ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) విభాగం ఐటీసర్వ్ అలయన్స్‌తో కలిసి స్థానిక పోలీసులకు 50 భోజనాలను అందజేశారు. ఈ వితరణను స్థానిక అధికారులు ప్రశంసించారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. నాట్స్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఫైనాన్స్/మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మల్లాది, జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కాండ్రు, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపాబే కో ఆర్డినేటర్ ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ టెంపాబే జాయింట్ కో-ఆర్డినేటర్ సురేశ్ బొజ్జ, ఐటిసర్వర్ ఎఫ్ఎల్ చాప్టర్ ప్రెసిడెంట్ భరత్ ముల్పురు, భాను ధూళిపాళ్ళ, నాట్స్ కోర్ సభ్యులు సుమంత్ రామినేని, శిరిష దొడ్డపనేని, దీప్తి రాటకోండ, ప్రభాకర్ శాఖమూరి, రుత్విక్, రిష్వితా ఆరికట్ల తదితరులు పాల్గొన్నారు.
టెంపాబే నాట్స్ వాలంటీర్లను ప్రోత్సాహించేందుకు నాట్స్ టెంపా బే విభాగం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. టెంపాబేలో నాట్స్‌కు పెరుగుతున్న ఆదరణకు వాలంటీర్లే కారణమని నాట్స్ నాయకత్వం వాలంటీర్లను ప్రశంసించింది. ఈ కార్యక్రమానికి వరంగల్ ఓయాసిస్ స్కూల్ ఛైర్మన్ డాక్టర్ జె.ఎస్. పరన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాట్స్ వాలంటీర్లను నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ సత్కరించారు.