ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ప్రధానితో గంట పాటు సమావేశం సాగింది. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, మిథున్‌రెడ్డి ఉన్నారు. అంతకు ముందు ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం లభించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. రేపు(మంగళవారం) ఉదయం 9.30కు కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.