Business

TNI నేటి వాణిజ్య వార్తలు

TNI నేటి వాణిజ్య వార్తలు

* ఔషధ ఎగుమతులను పెంచడానికి ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్‌) మరిన్ని చర్యలు తీసుకోనుంది. వివిధ దేశాల్లో బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ టు బీ) సమావేశాలను నిర్వహించడం ఔషధ నియంత్రణ సంస్థలతోచర్చించి ఔషధ ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించడం వంటి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఎగుమతిదిగుమతిదారుల మధ్య సమావేశాలను ఏర్పాటు చేయనుంది.

* ఒమైక్రాన్‌ భయాలు వెంటాడుతున్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు కొనసాగించడంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి, సెన్సెక్స్‌ మరో 672.71 పాయింట్లు బలపడి 59,855.93కి చేరుకుంది. నిఫ్టీ 179.55 పాయింట్లు 17,805.25 వద్ద క్లోజైంది. స్టాక్‌ మార్కెట్‌ సంపద మూడు సెషన్లలో రూ.7.75 లక్షల కోట్లు పెరిగి రూ.271.36 లక్షల కోట్లకు చేరుకుంది. నేటి సెషన్‌లో సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో ఐదు మినహా మిగతావన్నీ లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్‌టీపీసీ షేరు 5.48 శాతం పెరిగి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.

* యువ ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తల కోసం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ఇన్నోవేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐ-విన్‌) ప్రారంభించింది. మహిళలు ఏర్పాటు చేసిన స్టార్టప్‌లకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మార్గదర్శనం (మెంటరింగ్‌) వంటి సేవలతోపాటు స్టార్టప్‌ కంపెనీ ఎదిగేందుకు కావాల్సిన మద్దతును ఇస్తుంది. మహిళలు స్థాపించిన స్టార్ట్‌పలు నిధు ల సమీకరణ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది వీలు కల్పింస్తుందని ఐఎ్‌సబీ వెల్లడించింది.

* ఎస్‌బీఐ తన డిజిటల్‌ ఖాతాదారులకు శుభవార్త చెప్పిం ది. ఉచిత ఐఎంపీఎస్‌ (తక్షణ నగదు బదిలీ) చెల్లింపుల పరిమితిని ప్రస్తుత రూ. లక్షల నుంచి రూ. లక్షలకు పెంచిది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుంది. ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ లేదా తన యాప్‌ యోనో ద్వారా జరిగే డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు పొందే ఖాతాదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎస్‌బీఐ ఈ చర్య తీసుకుంది.

* ప్రముఖ రిటైల్‌ జువెలరీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ పెద్ద ఎత్తున వ్యాపార విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెలలో దేశ, విదేశాల్లో కొత్తగా 22 షోరూమ్‌లు ప్రారంభిస్తోంది. ఇందులో 10 షోరూమ్‌లు దేశం లో, 12 షోరూమ్‌లు పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో ప్రారంభిస్తోంది. తెలంగాణలోని సిద్దిపేటలోనూ కంపెనీ ఈ నెల 13న కొత్త షోరూమ్‌ ప్రారంభిస్తోంది.

* ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ కంపెనీకి మరో భారీ ఆర్డర్‌ లభించింది. ఒక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్డర్‌ లభించినట్టు కంపెనీ తెలిపింది. బహిరంగ టెండర్‌ ద్వారా ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ అనుబంధ సంస్థ ఈవే ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ఆర్డర్‌ సంపాదించింది. ఆర్డర్‌ విలువ రూ. కోట్ల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. కఈ విద్యుత్‌ బస్సుల్ని నెలల్లో ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అందించాలి. సంవత్సరాలు బస్సుల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది.

* హైదరాబాద్‌కి షాకిచ్చిన జేఎల్‌ఎల్‌ ఇండియా వార్షిక ఫలితాలు

దేశంలోని ఏడు ప్రముఖ పట్టణాల్లో కార్యాలయ స్థలాల లీజు (ఆఫీస్‌ స్పేస్‌) 2021లో నామమాత్రంగా 2 శాతం పురోగతే చూపించింది. 2019తో పోలిస్తే 45 శాతం తక్కువగా ఉండడం ఈ మార్కెట్‌ కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదని తెలియజేస్తోంది. కరోనా తర్వాత చాలా కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పని విధానాన్ని అమలు చేస్తుండడం తెలిసిందే. 2021లో 26.17 చదరపు అడుగుల స్థలం నికరంగా లీజుకు ఇచ్చినట్టు జేఎల్‌ఎల్‌ ఇండియా విడుదల చేసిన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2019లో నికర ఆఫీస్‌ స్పేస్‌ లీజు 47.8 మిలియన్‌ చదరపు అడుగులతో పోలిస్తే 45 శాతం తక్కువ. 2020లో 25.66 మిలియన్‌ చదరపు అడుగుల మేర ఉండడం గమనార్హం. భారత కార్యాలయ మార్కెట్‌పై జేఎల్‌ఎల్‌ ఇండియా త్రైమాసికం, ఏడాదికోసారి నివేదికలను విడుదల చేస్తుంటుంది. నికర వినియోగ లీజు స్థలాన్ని, మొత్తం వినియోగానికి అందుబాటులో ఉన్న కార్యాలయం స్థలం నుంచి ఖాళీగా ఉన్న దానిని మినహాయించి చెప్తారు.