WorldWonders

లైంగిక సంబంధం కోసం భార్యల మార్పిడి

లైంగిక సంబంధం కోసం భార్యల మార్పిడి

* రాకెట్ గుట్టురట్టు చేసిన పోలీసులు
* ఏడుగురి అరెస్ట్… 1000 జంటల ప్రమేయముందని పోలీసుల అనుమానం

సభ్య సమాజం తలదించుకునేలా భార్యల మార్పిడి రాకెట్ బాగోతం కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది. లైంగిక సంబంధం కోసం భార్యలను మార్పిడి చేసుకున్న రాకెట్లో ఏడుగురు నిందితులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు . భార్యల రాకెట్ బాగోతంలో దాదాపు 1000 జంటల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్న భర్తపై ఓ మహిళ కారుకాచల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఇంతకుముందు కాయంకుళం ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగుచూశాయి. భార్యల మార్పిడి రాకెట్ కేరళ రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించడానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఉపయోగించుకుందని పోలీసులు చెప్పారు. “భార్యలను మార్పిడి చేసుకున్నవారు టెలిగ్రామ్, మెసెంజర్ గ్రూపులలో చేరారు . అలా ఒకరికొకరు కనెక్ట్ అవుతారు.

** ఫిర్యాదు చేసిన మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నాం…
దీని వెనుక చాలామంది పాత్ర ఉందని, ఈ కేసుకు సంబంధించి మరికొంత మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం ‘అని చంగంచెరి డీఎస్పీ ఆర్.శ్రీకుమార్ చెప్పారు. నిందితులు అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు చెందినవారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ రాకెట్లో భాగమని పోలీసులు నిర్ధారించారు. భార్యల మార్పిడి బాగోతంపై 25 మంది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని, త్వరలో మరింత మంది నిందితులను అరెస్టు చేస్తామని కేరళ పోలీసులు వివరించారు.