ScienceAndTech

యూపీలో మామిడి వైన్.

యూపీలో మామిడి వైన్.

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలకు త్వరలో మామిడి వైన్‌ (మ్యాంగో వైన్‌) అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మద్యం విధానాన్ని సవరించాలని యూపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదన పంపింది. 1974 తర్వాత రాష్ట్రంలో మద్యం విధానాన్ని సవరించాల్సి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మామిడి వైన్‌ తయారీ యూనిట్లను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయొచ్చని ఎక్సైజ్‌ శాఖ చెబుతోంది. రూ.70 లక్షలతో ఒక యూనిట్‌ ఏర్పాటవుతుందని అంచనా. సాధారణంగా వైన్‌ తయారీకి ద్రాక్ష పండ్లు ఉపయోగిస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ద్రాక్ష ఉత్పత్తి పెద్దగా లేదు. అందుకే వినూత్నరీతిలో ఆలోచించిన ఎక్సైజ్‌ శాఖ.. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇతర పండ్ల నుంచి వైన్‌ తయారు చేయాలని భావించింది. మామిడి పండ్ల ఉత్పత్తిలో ఉత్తర్‌ప్రదేశ్‌కు మంచి పేరుంది. యూపీలోని మలిహాబాద్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన దశ్‌హరీ మామిడిని పండిస్తారు. ఈ మామిడి పండ్లనే వైన్‌ తయారీకి ఉపయోగించనున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.