Food

నోరూరించే సంక్రాంతి పిండివంటలు

నోరూరించే సంక్రాంతి పిండివంటలు

సంక్రాంతి పర్వదినాన వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా హోమ్‌ ఫుడ్స్‌ నిర్వాహకులు నోరూరించే పిండివంటలు సిద్ధం చేస్తున్నారు. పూర్వం ప్రతి ఇంట్లో రోలు, రోకలితో పిండ్లు దంచి స్వయంగా పెనం వేసి అరిసెలు, సున్ని పాకుండలు, జంతికలు, గులాబీ పువ్వులు, సున్నుండలు తయారుచేసుకునేవారు.  ఇరుగుపొరుగు కుటుంబాల వారు సాయంగా వచ్చేవారు. లేదంటే కిలోల వంతున దంచడానికి లేదా తయారు చేయడానికి మనుష్యులు ఉండేవారు. ప్రస్తుతం ఎవరికి వారు బీజీ జీవితంలో మునిగితేలు తుండటంతో సొంతంగా తయారీ మానుకున్నారు.

*ప్రస్తుతం మార్కెట్లో ఆర్డర్లు ఇస్తే చిటికెలో కోరిన వందల రకాల పిండివంటలు ఇంటి ముందుంచే వ్యాపారాలు పెరిగిపోయాయి.  వినియోగదారుల అభిరుచి మేరకు బెల్లం, పంచదార, నెయ్యి, జీడిపప్పు, నువ్వులు వంటివి జోడించడమే కాకుండా సుగర్‌లెస్‌ స్వీట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి రోజులకు అనువుగా కూడా ప్రత్యేక రకాల పిండివంటలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటికప్పుడు బూరెలు, పొంగడాలు కూడా అందిస్తున్నారు.**కుటీర పరిశ్రమ నుంచి బేకరీల వరకు ఇళ్లల్లో తయారీ తగ్గిన తరువాత కిలో దగ్గర నుంచి వందల కిలోల వరకు పిండివంటలు తయారుచేసి అందించే కుటీర పరిశ్రమలు విశాఖ నగరంలో వందల్లో వెలిశాయి. స్వీట్లు, బేకరీ అయిటెమ్స్‌ తయారు చేసే పెద్ద సంస్థలు కూడా రకరకాల పిండివంటలు సిద్ధం చేసి వినియోగదారులకు ఆహా్వనం పలుకుతున్నాయి. పండగ ప్రత్యేకతగా వెదురుబుట్టలలో నింపి ఇళ్లకు డెలివరీ చేస్తున్నారు.

**సంప్రదాయ పిండివంటలు లభ్యం ప్రస్తుతం మార్కెట్లో నిర్వాహకులు అరిసెలు, జంతికలు, సున్నపాకుండలతో పాటు బుల్లెట్‌ పాకుండలు, సున్నుండలు, తొక్కుడు లడ్డు, కోవా ముద్ద కుడుములు, బెల్లం మిఠాయి ఉండలు, పొంగడాలు, అప్పాలు, శనగపప్పు, పెసరపప్పు, కొబ్బరి, జున్నుతో తయార చేసే వివిధ రకాల బూరెలు, రవ్వ లడ్లు, గులాబి పువ్వులు, చంద్రకాంతలు, కజ్జికాయలు, గోరు మిఠాయి, సంపంగి పువ్వులు. సజ్జప్పాలు, గవ్వలు, చక్కిలాలు, మురుకులు, చెక్కలు, గోధుమ గొట్టాలు మొదలైన పిండివంటలు లభ్యమవుతున్నాయి.