నందిగామ నియోజకవర్గం కోడి పందేలకు సై…
బరులు సిద్ధం చేస్తున్న పందెంరాయుళ్లు…
సంక్రాంతి నేపథ్యంలో కోడి పందేలకు కంచికచర్ల,వీరులపాడు మండలాలో జోరుగా బరులు ఏర్పాట్లు జరుగుతున్నాయి…
పోలీసు, రెవెన్యూ అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా పందేలకు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి…
కోర్టుల ఆదేశాలు.. పోలీసుల హడావుడి… మైకుల్లో ప్రచారాలు, కత్తులు, పుంజుల స్వాధీనం, బరుల ధ్వంసం, నిర్వాహకుల అరెస్టులు అన్నీ సాగిపోతున్నాయి…
ఇవన్నీ మామూలే.. పండగ మూడు రోజులూ పందేలు జరుగుతాయి. మీరొచ్చేయండి.. అంటూ వివిధ రాజకీయ పార్టీ నాయకుల సందేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి…
నిర్వాహకులు కోళ్లు, కత్తులు సిద్ధం చేసుకుంటున్నారు. ఓచోట పోలీసులు బరిని ధ్వంసం చేస్తే.. మరోచోట బరులు ఏర్పాటు సిద్ధం అవుతున్నారు…
నందిగామ రూరల్ సీఐ నాగేంద్ర కుమార్ వివరణ…
అక్రమ మద్యం,పేకాట,కోడి పందాలు బరులు సిద్ధం చేసే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు వారిపై కఠిన చర్యలు తిసుకుని కేసు నమోదు చేస్తాము…