NRI-NRT

బ్రిటిష్‌ ప్రధానిగా రిషి సనక్‌కు అవకాశాలు!

బ్రిటిష్‌ ప్రధానిగా రిషి సనక్‌కు అవకాశాలు!

బ్రిటిష్‌ ప్రధాని పీఠంపై భారత సంతతికి చెందిన వ్యక్తి అధిరోహించే అవకాశాలు మెరుగవుతున్నాయి. బ్రిటిష్‌ చాన్సలర్‌, రిచ్‌మండ్‌ ఎంపీ రిషి సనక్‌కు ఆ అవకాశం దక్కే అవకాశాలున్నాయి. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో మందు పార్టీ ఇచ్చి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. బోరిస్‌ తీరుపై విపక్షం నుంచే కాకుండా.. స్వపక్షంలోనూ విమర్శలు ఉండడంతో, ఈ ఏడాది చివరికల్లా ఆయన గద్దెదిగాల్సిన పరిస్థితులు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. ఆయన స్థానంలో రిషి సనక్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పదవి కోసం విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, కేబినెట్‌ మంత్రి మిచేల్‌ గోవ్‌, విదేశాంగ శాఖ మాజీ మంత్రి జెర్మీహంట్‌, హోంమంత్రి ప్రీతి పటేల్‌, ఆరోగ్య శాఖ మంత్రి, పాక్‌ సంతతికి చెందిన సాజిద్‌ జావెద్‌ పోటీ పడుతున్నా.. రేసులో మాత్రం రిషి ముందంజలో ఉన్నారు.