అల్లు అరవింద్ సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’.. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించి, కేవలం తెలుగు వారికి మాత్రమే ప్రత్యేక ఓటీటీగా అందుబాటులోకి వచ్చింది ‘ఆహా’. తెలుగు వెబ్ సిరీస్, తెలుగు సినిమాలు, టాక్ షోస్ తో పాటు మలయాళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ‘ఆహా’ను ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్ లాగానే ఇతర భాషల్లోనూ విస్తరించడానికి నిర్వాహకులు ఎప్పటినుంచో ప్రయత్న చేస్తున్నారట. ఎట్టకేలకు తొలి అడుగు పడినట్లు తెలుస్తుంది. ‘ఆహా’ తమిళ ప్లాట్ ఫామ్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అంతేకాదు ‘ఆహా’ లో మొదటి తమిళ స్ట్రీమింగ్ ప్రాజెక్ట్ కూ ముహూర్తం కూడా కుదిరింది. కాగా, ఈ నెల 28న ‘ఆహా’ తమిళం అందుబాటులోకి రాబోతోంది. అందులో భాగంగా మొదటి కంటెంట్ గా శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఇరై’ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. అంతేకాదు తమిళం నుంచి భారీ ఎత్తున కంటెంట్ ను ఆహా టీమ్ కొనుగోలు చేయబోతోంది. తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ తో పాటు టాక్ షోస్ కూడా ఇందులో ఉండబోతున్నాయి. ‘ఆహా’ తెలుగుకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరహాలోనూ ఆహా తమిళానికి కూడా ఓ తమిళ స్టార్ హీరో అన్వేషణలో ఉందట టీమ్. మరి తెలుగులో లాగానే తమిళంలోనూ ‘ఆహా’.. ఆహా అనిపిస్తుందేమో చూడాలి.