Health

ఏ జబ్బుకు ఏ వైద్యులు?

ఏ జబ్బుకు ఏ వైద్యులు?

చికిత్స చేసే వాళ్లందర్నీ వైద్యులనే పిలుస్తాం. అలాగని అన్ని రకాల రుగ్మతలకూ ఒకే వైద్యుడిని కలిసే పరిస్థితి ఉండదు. లక్షణాలను బట్టి, రుగ్మత స్వభావాన్ని బట్టి ఆ కోవకు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులను ఎంచుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలకు ఏ వైద్యులను ఎంచుకోవాలో తెలుసుకుందాం!

*అలర్జిస్ట్‌/ఇమ్యునాలజిస్ట్‌:
వ్యాధినిరోధక వ్యవస్థ రుగ్మతలు, ఆస్తమా, ఎగ్జీమా, ఫుడ్‌ అలర్జీలు, పురుగు కాటు అలర్జీలు, ఆటోఇమ్యూన్‌ డిజార్డర్లు

*ఎండోక్రైనాలజిస్ట్‌:
థైరాయిడ్‌ సమస్యలు, మధుమేహం, మెటబాలిజం డిజార్డర్లు

*ఫ్యామిలీ ఫిజీషియన్‌:
రొటీన్‌ చెకప్స్‌, వ్యాక్సిన్లు, రుగ్మతలకు సంబంఽధించిన చికిత్సల పర్యవేక్షణ

*గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌:
పొట్ట, పిత్తాశయం, కాలేయం, క్లోమం, కాలేయాలకు సంబంధించిన రగ్మతలు. పొట్టలో నొప్పి, అల్సర్లు, వాంతులు, విరోచనాలు, కామెర్లు మొదలైన రుగ్మతలకు ఈ వైద్యులను సంప్రతించాలి.

*హెమటాలజిస్ట్‌:
రక్తం, ప్లీహం, లింఫ్‌ గ్రంథులకు సంబంధించిన రుగ్మతలైన సికెల్‌ సెల్‌ డిసీజ్‌, అనీమియా, హీమోఫీలియా, లుకేమియాలకు ఈ వైద్యులను సంప్రతించాలి.

*పాలియేటివ్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌:
మరణానికి చేరువలో ఉన్న వ్యక్తులు చివరి రోజుల్లో నాణ్యమైన జీవితం గడపడానికి తోడ్పడే వైద్యులు వీళ్లు. నొప్పిని తగ్గించే చికిత్సతో పాటు, ఇతర వైద్యుల సహాయంతో రోగి చివరి రోజులు సాధ్యమైనంత ఆహ్లాదంగా గడిపేందుకు అవసరమైన చికిత్సను అందిస్తారు.

*ఇన్‌ఫెక్షియస్‌ డిసీజ్‌ స్పెషలిస్ట్‌:
జ్వరం, లైమ్‌ డిసీజ్‌, న్యుమోనియా, క్షయ, హెచ్‌ఐవి మొదలైన శరీరంలో ఏ అవయవానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్లను అయినా కనిపెట్టి, వాటికి తగిన చికిత్సను సూచిస్తారు.

*జెనెటిసిస్ట్‌:
వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులను ఈ వైద్యులు కనిపెట్టగలుగుతారు. జెనెటిక్‌ కౌన్సెలింగ్‌తో పాటు, స్ర్కీనింగ్‌ పరీక్షలను కూడా సూచిస్తారు.

*నెఫ్రాలజిస్ట్‌:
మూత్రపిండాల వ్యాధుల కోసం ఈ వైద్యులను ఎంచుకోవాలి.

*ఓటోలారింగాలజిస్ట్‌:
చెవి, ముక్కు, గొంతు, సైనస్‌లు, తల, మెడ, శ్వాసకోశ వ్యవస్థకు చెందిన రుగ్మతలకు ఈ వైద్యులను ఎంచుకోవాలి.

*స్లీప్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌:
నిద్ర సమస్యలకు ఈ వైద్యులను ఎంచుకోవాలి.

*యూరాలజిస్ట్‌:
మూత్రాశయ సమస్యలు, ప్రోస్టేట్‌ పరీక్ష కోసం ఈ వైద్యులను ఎంచుకోవచ్చు.

*యాండ్రాలజిస్ట్‌:
పురుషుల్లో ఇన్‌ఫెర్టిలిటీ, హార్మోన్‌ సమస్యలు, జననావయవాల రుగ్మతలకు ఈ వైద్యులను సంప్రతించాలి.