NRI-NRT

చికిత్స కోసం అమెరికా వెళ్ళిన కేరళ ముఖ్యమంత్రి

చికిత్స కోసం అమెరికా వెళ్ళిన కేరళ ముఖ్యమంత్రి

చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ . కొంతకాలం అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని వెల్లడించారు . మరెవరికీ పాలనాబాధ్యతలను అప్పగించబోనని స్పష్టం చేశారు అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటానని తెలిపారు . చికిత్స కోసం తన భార్య , వ్యక్తిగత సిబ్బందితో కలిసి విజయన్ అమెరికా వెళ్లారు . జనవరి 29 న తిరిగి రానున్నారు . బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానికి కూడా సీఎం వర్చువల్ పద్ధతిలోనే హాజరయ్యారు . కాగా జనవరి 19 న మరో కేబినెట్ భేటీ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు ఆస్పత్రి బెడ్పై నుంచీ పని చేస్తానని ఈ మేరకు సూచనాప్రాయంగా వెల్లడించారు . పినరయి విజయన్ 2018 లో వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు ఈపీ జయరాజన్కు బాధ్యతలు అప్పగించారు . ఈసారి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులైన ఎంవీ గోవిందన్ , కె.రాధాకృష్ణనక్కు బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు . అయితే , కేబినెట్ భేటీ ప్రకటనతో ఈ ఊహాగానాలకు సీఎం తెర దింపారు .