Politics

చదలవాడకు అస్వస్థత.. జొన్నలగడ్డలో తెదేపా ధర్నా.

చదలవాడకు అస్వస్థత.. జొన్నలగడ్డలో తెదేపా ధర్నా.

నరసరావుపేటలో హై టెన్షన్ వాతావరణం

జొన్నలగడ్డలో ధర్నా చేస్తున్న టీడీపీ ఇన్-ఛార్జ్ డాచదలవాడ అరవింద బాబుని బూటు కాళ్లతో తన్నిన నరసరావుపేట రురల్ సి.ఐ,రొంపిచర్ల ఎస్.ఐ__అరవింద బాబుని ఆసుపత్రికి తరలింపు. అరవింద బాబుని ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ అద్దాలు ధ్వంసం. పోలీసులు దాడిలో అరవింద బాబుకి తీవ్ర అస్వస్థత. నరసరావుపేటలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలింపు_ ఆసుపత్రి వద్దకి భారీగా చేరుకుంటున్న టీడీపీ కార్యకర్తలు_. అరవింద బాబుని ఫోన్ లో పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు_ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన.

నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా.అరవింద బాబు పై దాడిని ఖండించిన చంద్రబాబు.ఆసుపత్రికి లో చికిత్స పొందుతున్న అరవింద్ బాబు ఆరోగ్య పరిస్థితి పై నేతలతో మాట్లాడిన చంద్రబాబు. పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్ట్ లపై నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేస్తారా? అక్రమ అరెస్ట్ లపై ప్రశ్నించిన అరవింద్‍ బాబు, ఇతర నేతల పై పోలీసులు దౌర్జన్యం చేయడం వారి వైఖరికి నిదర్శనం.టీడీపీ శ్రేణులపై వైసీపీ వారు దాడి చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారు!?అస్వస్థతకు గురైన టీడీపీ నేతలను తరలించే అంబులెన్స్ పైనా దాడికి దిగడం వైసీపీ ఆరాచకానికి, పోలీసుల వైఫల్యానికి నిదర్శనం. ఘర్షణకు కారణమైన వైసీపీ కార్యకర్తలతో పాటు పోలీసుల పైన చర్యలు తీసుకోవాలి.

****అరవింద్ బాబుకు ఏం జరిగినా పోలీసులదే బాధ్యత
ఇది ప్రజాస్వామ్యమా? గూండా రాజ్యమా?
రాష్ట్రంలో పోలీసులే వైసిపి కార్యకర్తల మాదిరిగా మారి తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై పోలీసుల దాడికి దిగారు. టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద్ బాబును అత్యంత కర్కశంగా దాడిచేశారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారి రాక్షసుల్లా దాడికి తెగబడటం చూస్తే రాష్ట్రంలో జగన్ స్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యం అంతరించిపోయినట్లుగా కన్పిస్తోంది. అరవింద్ బాబు ప్రాణాలకు ఎటువంటి ముప్పు సంభవించినా పోలీసులే ఇందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాను. జొన్నలగడ్డలో వైఎస్ విగ్రహాన్ని వైసిపి నాయకులే మాయం చేసి ఆ నెపాన్ని టిడిపి కార్యకర్తలపై నెట్టి అక్రమ అరెస్ట్ చేశారు. ఇందుకు నిరసనగా తమశ్రేణులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు ఒక్కసారిగా మీదపడి లాఠీచార్జికి దిగడం హేయం. పోలీసులే వైసిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తే ఇక ప్రజాస్వామ్యానికి దిక్కెవరు? టిడిపి శ్రేణులపై దాడికి దిగి గాయపర్చిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర డిజిపిని డిమాండ్ చేస్తున్నాను.