WorldWonders

అతి చిన్న ఆవు.. రాణిని చూశారా? 

అతి చిన్న ఆవు.. రాణిని చూశారా? 

దాదాపు రెండేళ్ల వయసున్న ఆవు గురించి సోషల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది.ఈ ఆవు ఎత్తు 20 అంగుళాలు. బరువు 28 కిలోలు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆవు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ఆనుకుని ఉన్న చరిగ్రామ్ ప్రాంతంలో ఉంటోంది.ఈ మరుగుజ్జు ఆవుకు రాణి అని పేరు పెట్టారు. ఈ ఆవును చూసుకుంటున్న‌ నిర్వాహకుడు హసన్ హవల్దార్.ఈ ఆవు పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. తిండి విషయంలో కూడా ఈ ఆవు సాధారణ ఆవులకు పూర్తి భిన్నంగా ఉంటుంది.దీనికి రోజుకు రెండుసార్లు కొద్దిగా గడ్డి మాత్రమే ఇస్తారు. ఈ చిన్నారి ఆవును చూసేందుకు చాలామంది వ‌స్తుంటారు.ఈ చిన్న ఆవుతో సెల్ఫీ దిగడానికి పోటీలు ప‌డుతుంటారు. లైవ్‌సైన్స్ అనే వెబ్‌సైట్ రిపోర్టు ప్రకారం మంచి పాల ఉత్పత్తి సామర్థ్యం, తక్కువ ఆహారం కారణంగా మరగుజ్జు ఆవులను చాలామంది ఇష్టపడతారు. కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ 2016లో ఒక సదస్సులో మ‌ర‌గుజ్జు ఆవుల‌కు సంబంధించిన‌ అధ్యయన నివేదికను సమర్పించింది. వేచూర్ ఆవులలో థర్మామీటర్ జన్యువులు ఉన్నాయని పేర్కొంది.అందుకే వేడి వాతావరణంలో వాటి పెరుగుదల నెమ్మదిగా ఉంటుందని వివ‌రించింది.