Devotional

గోత్రం అంటే ఏమిటి.. ?

గోత్రం అంటే ఏమిటి.. ?

సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్లి నప్పుడు స్వామివారికి అర్చనలు చేస్తున్న సమయంలో మన ఇంటి పేరు గోత్రనామాలు తెలుసుకుంటారు.ఈ క్రమంలోనే వివాహ సమయంలో ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహం చేసేటప్పుడు వారి గోత్రాలు తెలుసుకొని వివాహం చేస్తారు. ఒకే గోత్రం ఉన్న వారికి వివాహం ఎప్పుడు చెయ్యరు. అలా ఒకే గోత్రం ఉన్న వారికి వివాహం ఎందుకు చేయరు? అసలు గోత్రం అంటే ఏమిటి? దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

***సంస్కృతం ప్రకారం గో అంటే ఆవు త్రం అంటే శాల గోత్రం అంటే గోశాల అని అర్థం వస్తుంది. అయితే ఈ గోత్రం వెనుక జన్యుశాస్త్రం దాగి ఉంది. గోత్రానికి జన్యు శాస్త్రానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే.. సాధారణంగా మానవాభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా మన శరీరంలో ఉన్నటువంటి క్రోమోజోమ్ కలయిక వల్ల వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే అమ్మాయిలలో x x క్రోమోజోమ్ లు ఉంటే అబ్బాయిలలో XY క్రోమోజోములు ఉంటాయి.

***అమ్మాయి నుంచి x క్రోమోజోమ్ అబ్బాయి నుంచి y క్రోమోజోమ్ విడుదలైనప్పుడు వారికి అబ్బాయి పుట్టి వంశం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ y క్రోమోజోమ్ x క్రోమోజోమ్ అణచివేస్తుంది కనుక ఒక అమ్మాయి వివాహం తరువాత తప్పనిసరిగా తన గోత్రనామాలను మార్చుకోవలసి వస్తుంది.అదే విధంగా ఒకే గోత్రం ఉన్న వారికి ఎందుకు వివాహం చేయరు అనే విషయానికి వస్తే…ఒకే గోత్రం ఉన్న వారిలో ఈ విధమైనటువంటి క్రోమోజోములు విడుదలయ్యి వంశాభివృద్ధి జరిగినప్పటికీ కొన్ని జన్యు లోపాల కారణంగా పుట్టబోయే బిడ్డలో లోపాలు ఏర్పడతాయి. అందుకోసమే చాలావరకు ఒకే గోత్రం ఉన్న వారికి వివాహం చేయరు. ఈ విధంగా గోత్రం వెనుక కూడా సైన్స్ దాగి ఉందని నిపుణులు వెల్లడించారు. అందుకే అమ్మాయికి వివాహం తర్వాత గోత్రనామాలు పూర్తిగా మారిపోతాయి.