యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో కరోనా సంక్షోభం వేళ తోటి ప్రవాసీయులను ఆదుకున్న కొంత మంది ప్రవాసీలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాయబార కార్యాలయం సత్కరించింది. వరంగల్‌కు చెందిన రాజ శ్రీనివాసరావును బుధవారం అబుదాబిలో భారత రాయబారి సంజయ్ సుధీర్ సన్మానించారు. యూఏఈలో ఉన్న 34 లక్షల మంది ప్రవాసీయుల భద్రత, సంక్షేమం భారత ప్రభుత్వ కర్తవ్యమని సంజయ్ సుధీర్ చెప్పారు. ఆద్నాక్ చమురు ఉత్పాదాక సంస్ధలో ఇంజనీర్‌గా పని చేస్తున్న రాజ శ్రీనివాసరావు అబుదాబిలో తెలుగు ప్రవాసీయుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. కరోనా వేళ ఆయన భారతీయ క్లబ్ తరఫున చేసిన సేవలకు గాను బిర్లా ఫౌండేషన్ కూడా గతంలో సత్కరించింది. ఇదిలా ఉండగా, అబుదాబి, దుబాయిలతో పాటు జెద్దా, రియాద్, కువైత్, మస్కత్లో కూడా బుధవారం భారత 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రవాసీలు నిర్వహించారు.
అబుదాబిలో తెలుగు ప్రవాసీకి ఘన సన్మానం
