అట్లాంటా తెలుగు సంఘం (TAMA) సంక్రాంతి సంబరాలు ఈరోజు ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తున్నారు. రవి కల్లి అధ్యక్షునిగా, శ్రీరాం రొయ్యల చైర్మన్ గా జనవరి ఒకటి నుంచి 2022 సంవత్సరానికిగాను కార్యవర్గ బాద్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరి ఆద్వార్యంలో మొట్టమొదటి సాంస్కృతిక కార్యక్రమం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడానికి ప్రణాళిక తయారు చేసారు. ప్రముఖ యాంకర్ శ్రీముఖి, మిమిక్రీ రమేష్, సురభి డ్రామా ధీ ఎటర్ వారి భక్త ప్రహ్లాద నాటకం, ముగ్గుల పోటీ పంచె కట్టు పోటీ, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించనున్నాయి.
నేడే ‘తామా’ సంక్రాంతి సంబరాలు
