*భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. టెలికాం సంస్థలకు ప్రీపెయిడ్ ప్యాక్ల విషయంలో వాలిడిటీని పెంచాలని షాకిచ్చింది.తద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారుల ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ విషయంలో గుడ్ న్యూస్ చెప్పినట్లయ్యింది. గతంలో ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30 రోజుల కాలపరిమితితో లభ్యమయ్యేవి. అయితే, ఆ తర్వాత వీటిని అన్ని టెలికం సంస్థలు 28 రోజులకు తగ్గించేశాయి. ఫలితంగా సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. వినియోగదారులకు ఇది భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి సంస్థ 30 రోజుల కాలపరిమితితో.. ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకురావాలని ఆదేశించింది.
ఈ మేరకు టెలికమ్యూనికేషన్ ఆర్డర్ 1999కి మార్పు చేస్తూ.. ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్‌లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెలా ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, రెండు నెలల్లోపు తమ ఆదేశాలను అమలు చేయాలని టెల్కోలను ఆదేశించింది.
* దేశీయ స్టాక్ మార్కెట్‌కు వారాంతంలోనూ నష్టాలు తప్పలేదు. శుక్రవారం ఆరంభంలో లాభాలతో ప్రారంభమైనా సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యాయి. ఒక దశలో 58,000 పాయింట్లను తాకిన సెన్సెక్స్ అనంతరం 57,119.28 పాయింట్లకు పడిపోయింది. చివరకు 76.71 పాయింట్ల నష్టంతో 57,200.23 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 8.20 పాయింట్ల స్వల్పనష్టంతో 17,101.95 వద్ద క్లోజైంది. దీంతో ఈ వారం సెన్సెక్స్ 1,836.95 పాయింట్లు, నిఫ్టీ 515.20 పాయింట్లు నష్టపోయినట్టయింది.
* మార్చి నెలాఖరుకల్లా బాహుబలి ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సెబీకి ఐపీఓ ముసాయిదా పత్రాలు సమర్పించిన మూడు వారాల్లోగా అనుమతి పొందేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా సెబీ ఇందుకు 75 రోజుల సమయం తీసుకుంటుంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్నందున సెబీ అనుమతి ప్రక్రియ మొత్తాన్ని మూడు వారాల్లో పూర్తి చేయాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దేశ ఐపీఓ మార్కెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్‌ఐసీ ఈక్విటీలో ఐదు శాతం ఐపీఓ ద్వారా విక్రయించి 1,200 కోట్ల డాలర్లు (సుమారు రూ.90,000 కోట్లు) సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
* ప్రపంచంలోని ఇతర సెంట్రల్ బ్యాంకుల కన్నా ఎక్కువ కాలం పాటు ఆర్‌బీఐ సద్దుబాటు ద్రవ్య విధానం అనుసరిస్తున్నదన్న విమర్శలను డిప్యూటీ గవర్నర్ మైఖెల్ డి పాత్రా తిప్పికొట్టారు. ఆ వైఖరి ఎంతగానో కలిసి వచ్చిందని భవిష్యత్తులో వచ్చే వైరస్ దాడులను కూడా దీటుగా ఎదుర్కొనగల సామర్థ్యాన్ని భారత్ పొందిందని చెప్పారు. కేవలం క్రూడాయిల్ ధరల కారణంగానే ద్రవ్యోల్బణం పెరిగిందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవల్‌పమెంట్ వర్చువల్‌గా నిర్వహించిన సీడీ దేశ్‌ముఖ్ స్మారకోపన్యాసంలో మాట్లాడుతూ.. ఇతర బ్యాంకులతో పోల్చి తే రేట్ల పెంపులో ఆర్‌బీఐ వెనుకబడిన మాట నిజమేనని కాని అది సరైనదా కాదా అనే అంశం కాలమే చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి దాని ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ కి పైగా చర్యలు తీసుకున్నదని చెప్పారు.
* కొత్త చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ)గా అనంత నాగేశ్వరన్‌ను ప్రభుత్వం నియమించింది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది. గత ఏడాది డిసెంబరులోకేవీ సుబ్రమణియన్ మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావటంతో ఈ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. క్రెడిట్ సూయిస్ గ్రూప్ ఏజీజూలియస్ బేర్ గ్రూప్ మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన నాగేశ్వరన్ శుక్రవారం నాడు సీఈఏగా బాధ్యతలు చేపట్టినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
* డిసెంబరు త్రైమాసికంలో సిగ్నిటీ టెక్నాలజీస్.. రూ.325.46 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.26.55 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 45.4 శాతం పెరిగింది. మొత్తం ఆదాయంలో ఐదు క్లయింట్ల వాటానే 21.8 శాతంగా ఉందని కంపెనీ పేర్కొంది. ఇందులో బీఎ్‌ఫఎ్‌సఐ, రిటైల్, ఈ-కామర్స్ రంగాలున్నాయని తెలిపింది.
* సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు 11వ రౌండ్ బిడ్డింగ్ ఫలితాలను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) శుక్రవారం ప్రకటించింది. మొత్తం 65 భౌగోళిక ప్రాంతాల(జీఏ)కు బిడ్డింగ్ నిర్వహించగా.. 61 జీఏలకు బిడ్లు లభించాయి. అందులో 52 జీఏల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో అదానీ టోటల్ గ్యాస్ అత్యధికంగా 14 ప్రాంతాల లైసెన్సులను దక్కించుకుందని పీఎన్‌జీఆర్‌బీ తెలిపింది.
* అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక మాంద్యం నుంచి బయట పడింది. కొవిడ్ దెబ్బతో 2020లో 3.4 శాతానికి కుంగిపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ 2021లో 5.7 ు వృద్ది నమో దు చేసింది. 1984 తర్వాత అమెరికా జీడీపీ ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. అంతకు ముందు 1946లో మా త్రం 11.6 ు వృద్ధి నమోదైంది. గత ఏడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో అయితే 6.9ు వృద్ధి రేటు నమోదైంది. అయితే ఒమైక్రాన్ దెబ్బతో 2022 జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు జోరు తగ్గుతుందని భావిస్తున్నారు.