నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఇచ్చిన ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆయన ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు. ఫిబ్రవరి 3వ తేదీన ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
రాజుగారి డొంక కదిలింది
