Food

Food products విషయమై సౌదీ కీలక నిర్ణయం..!

Food products విషయమై సౌదీ కీలక నిర్ణయం..!

సౌదీ అరేబియా స్థానిక, దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తుల విషయమై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడులేస్తోంది. ఈ మేరకు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ(ఎస్‌ఎఫ్‌డీఏ) తాజాగా కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఆహార ఉత్పత్తులపై హలాల్ సర్టిఫికేషన్ తప్పనిసరి చేయాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఆహార ఉత్పత్తులపై హలాల్ సర్టిఫికేట్‌ అనేది మాంసం, పౌల్ట్రీ, అన్ని సారూప్య ఉత్పత్తులకు వర్తిస్తుందని ఎస్‌ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. జెలాటిన్, కొల్లాజెన్, యానిమల్ రెన్నెట్, జంతు కొవ్వులు, నూనెలను కలిగి ఉన్న ఏదైనా ఇతర ఆహార ఉత్పత్తులన్నింటికీ హలాల్ సర్టిఫికేట్ జారీ చేయవలసి ఉంటుందని ఈ సందర్భంగా అథారిటీ పేర్కొంది. అలాగే హలాల్ లోగో, గుర్తు లేదా పదం ఉన్న ఆహార ఉత్పత్తులకు కూడా హలాల్ సర్టిఫికేట్ తప్పనిసరి అని ఎస్‌ఎఫ్‌డీఏ తెలియజేసింది. ఆహార ఉత్పత్తులపై హలాల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలనే నిబంధనను వచ్చే జూలైలో అమలులోకి తీసుకు వచ్చే యోచనలో అథారిటీ ఉంది.