ScienceAndTech

ఛాపర్, హెలికాప్టర్ మధ్య తేడాలేమిటో తెలుసా?

ఛాపర్, హెలికాప్టర్ మధ్య తేడాలేమిటో తెలుసా?

హెలికాప్టర్ గురించి మాట్లాడినప్పుడు ఛాపర్ అనే పదం కూడా వినిపిస్తుంటుంది. దీంతో హెలికాప్టర్, ఛాపర్ రెండూ ఒకటేనని అనుకుంటాం. అయితే హెలికాప్టర్, ఛాపర్ మధ్య తేడాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హెలికాప్టర్ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం.. ఇది ఫ్యాన్-మౌంటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్. దానిపైన ఫ్యాన్ ఉంటుంది. దాని సాయంతోనే అది ఎగురుతుంది. హెలికాప్టర్లు ఎగరడానికి ఎటువంటి రన్‌వే అవసరం లేదు. అవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి. విమానాలతో పోల్చి చూస్తే దీనిలో తక్కువమంది ప్రయాణికులను మాత్రమే తరలించవచ్చు. ఛాపర్ అనేది భారీ సాంకేతిక యంత్రాలతో కూడిన హెలికాప్టర్ కోసం ఉపయోగించే పదం. హెలికాప్టర్‌ను ఛాపర్ అని కూడా అనవచ్చు. అకస్మాత్తుగా వీచే గాలి కారణంగా హెలికాప్టర్ రెక్కలకు అవాంతరాలు ఏర్పడితే చాపర్‌ సాయంతో అది ఎగురుతుంది.