DailyDose

సిద్ధిపేట దోపిడీ కేసులో ఆధారాలు లభ్యం – TNI నేర వార్తలు 01/02/2022

సిద్ధిపేట దోపిడీ కేసులో ఆధారాలు లభ్యం – TNI  నేర వార్తలు 01/02/2022

* సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పట్టపగలే తుపాకీతో కాల్పులు జరిపి రూ. 43.50 లక్షలు దోచుకెళ్లిన ఘటనలో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. వీరికి అదనంగా మరో 15 బృందాలు జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దాడికి ఉపయోగించిన తుపాకీ కారులోనే డోరుకు , సీటుకు మధ్య ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తుపాకీ స్థానికంగా తయారు చేసిన అక్రమ ఆయుధమని తెలుస్తోంది. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా దర్యాప్తు బృందాలకు కమిషనర్ శ్వేత దిశానిర్దేశం చేస్తున్నారు. చరవాణి సిగ్నళ్ల తో పాటు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. వీటి ఆధారంగా దుండగులు రాజీవ్ రహదారి గుండా హైదరాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించారు.

*ముంబై పోలీసులకు చిక్కిన వ్యాపారవేత్త గజేంద్ర ఫారెక్..ఆటోమోబైల్ రంగంలో మోసాలకు పాల్పడ గజేంద్ర..ముంబైలో కోట్ల రూపాయల మోసం చేసిన గజేంద్ర .ముంబై పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న గజేంద్ర.గజేంద్ర ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు..హైదరాబాద్ డ్రగ్స్ case lo గజేంద్ర నిందితుడు. గజేంద్రను పట్టుకునేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తున్న హైదరాబాద్ పోలీసులు. PT Warrant వేసి గజేంద్ర ను హైదరాబాద్ కు తీసుకొని రానున్న పోలీసులు.హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పరారీలో మరో ముగ్గురు వ్యాపారవేత్తలు

*విశాఖ లో మరో సారి డ్రగ్స్ కలకలం.
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించినవెస్ట్ ఎసిపీ శ్రీ పాదరావు కామెంట్స్…ఎన్ఎడి వద్ద డ్రగ్స్ కలిగి ఉన్న యువతి యువకుడుతో పాటు రాజం కు చెందిన మరో డాక్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైద్రబాద్ కు చెందిన గీత, మాలవ్య, విశాఖ కు చెందిన హేమంత్, రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీ నలుగురు స్నేహితులు వీరంతా గోవాలో డ్రగ్స్ తీసుకుంటారు ఇటీవల హెమంత్ డగ్స్ కావలని పృథ్వీ అకౌంట్ నుండి 33 వేలు ఫోన్ పే ద్వారా పంపాడు గీత డ్రగ్స్ సప్లయ్ చేస్తుంది.. మాలవ్య ఓ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తుంది గీత మాలవ్య తో హేమంత్ కు డ్రగ్స్ పంపించింది 29వ తేదిన డ్రగ్స్ తో హైద్రబాద్ నుండి మాలవ్య బయలుదేరి 30 ఉదయం విశాఖ కు వచ్చింది సిటిటాస్క్ పోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎన్ఎడి జంక్షన్ వద్ద పోలీసుల మాటు వేసారు మాలవ్య ను తీసుకెళ్లేందుకు హేమంత్ ఆడి కారు లో వచ్చాడు ఇద్దరు కలిసి కారు ఎక్కిన తరువాత మాలవ్య హేమంత్ కు డ్రగ్స్ ఇస్తుండగా పట్టుకున్నాము ఈ కేసులో హేమంత్ ను మాలవ్య ను డాక్టర్ పృథ్వీ ని అరెస్ట్ చేసాము వీరి వద్ద నుండి 18 ఎంఎండిఏ పిల్స్,2 ఎంఎండిఏ క్లీష్టర్ పౌడర్,ఓ సెల్ పోన్, 20,500 క్యాష్ స్వాదినం వీరందరు హైద్రబాద్ లో పబ్ ల ద్వారా ఒకర్ని ఒకరు పరిచయం అయ్యారు హైద్రబాద్,బెంగళూరు,గోవా,నుండి వీరు డ్రగ్స్ కోనుగోలు చేస్తున్నారు ప్రస్తుత విచారణలో వీరు వినియోగించుకోవడానికే వీటిని తీసుకోచ్ఛినట్లు తెలింది….ఓక్కో ట్యాబులేట్ 1500 కు కొనుగోలు చేసారు.

* కృష్ణా జిల్లాలో అప్పుల బాధతో ఓ చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పెడనపట్నంలోని 17వ వార్డులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పద్మనాభం, భార్య లీలావతి, కొడుకు రాజా నాగేంద్రంగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* కర్నూలుజిల్లాలోని ప్రకాష్‌నగర్ వద్ద రైలు కింద పడి సాఫ్టువేర్ ఉద్యోగి సూసైడ్చేసుకున్నాడు. మృతుడు కల్లూరు ఎస్టేట్ వెంకటాచలపతి నగర్‌కు చెందిన ముఖేష్ రెడ్డి(26)గా గుర్తించారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న ముఖేష్ జీవితం మీద విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* డాబాపైన ఉన్న కొడుకు కిందికొస్తాడేమో అని ఆ తల్లి చాలాసేపు ఎదురు చూసింది. ఎంతకూ రాకపోవడంతో అన్నం తినేందుకు రమ్మని పిలుస్తూ ఆమే పైకి వెళ్లింది. తర్వాత అక్కడ కనిపించిన దృశ్యం చూసి, ఆ తల్లి షాకైంది. సగం కాలిన స్థితిలో ఉన్న కొడుకు శవాన్ని చూసి బోరుమంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిచింది.

* ఓ వివాహితపై భర్తతోపాటు అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో జరిగింది. ఓ వివాహితపై ఆమె భర్తఅతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసిఆమె ప్రైవేటు భాగంపై సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురిచేశారని పోలీసులు తెలిపారు.ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులుతెలిపారు.తన భర్త, నలుగురు ఇతరులు తనపై అసహజ శృంగారం జరిపి, తన ప్రైవేట్ భాగాలను సిగరెట్‌తో కాల్చి తనను హింసించారని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.లైంగిక వేధింపులను తాను ప్రతిఘటించడంతో వారు చంపేస్తామని బెదిరించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది.