ఆర్ధిక విషయాల్లో మెళకువలు తెలిపే నిమిత్తం మహిళలకు నాట్స్ ఆధ్వర్యంలో గత 29వ తేదీన ఆన్ లైన్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా సాధికారిత సంస్థ వ్యవస్థాపకులు, టెక్నాలజీ సోలుషన్స్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా ప్రశాంతి గండి ఈ వెబినార్కు ముఖ్య అతిధిగా విచ్చేసి ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమానికి దొడ్డి మాధవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నాట్స్ బోర్డు చైర్ పర్సన్ గంటి అరుణ సారధ్యంలో ఈ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా పెద్దిభొట్ల జయశ్రీ, బొజ్జ లక్ష్మి, వనం జ్యోతి, అక్కినేని శృతిలు వ్యవహరించారు.