ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఎల్.గోవిందపురానికి చెందిన కోసూరి మమత అనే ఇంజినీరింగ్ విద్యార్థినికి డల్లాస్‌కు చెందిన ప్రవాసులు లోకేష్‌నాయుడు, జాస్తి వెంకట్‌లు చేయూతనందించారు. ఆమె విద్యాభ్యాసానికి అవసరమైన ₹70వేల విలువైన ల్యాప్‌టాప్‌ను, ₹50వేల ఆర్థిక సాయాన్ని UTF జిల్లా కోశాధికారి రాంబాబు చేతులమీదుగా అందజేశారు. వీరి సాయానికి మమత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.