DailyDose

చింతామణి నాటకం నిషేధంపై హైకోర్టు సీరియస్

చింతామణి నాటకం నిషేధంపై హైకోర్టు సీరియస్

చింతామణి నాటకం నిషేధం వ్యవహారంలో ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్‌ సీరియస్‌ అయ్యింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది ఉమేష్‌ చంద్ర వాదనలు వినిపించారు. నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే పాత్రను తొలగించాలి కానీ.. నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని బ్యాన్ చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్నినిషేధించలేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్య వైశ్యులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కోర్టు ముందుంచాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం, ఇతర అధికారులు అందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.