సాధారణంగా చాయ్ అంటే చాలా మందికి ఇష్టముంటుంది. ఉదయాన్నే కప్పు టీ తాగితే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అలాగే మానసికంగా ఒత్తిడి కలిగి.. పనిభారం తగ్గాలి అనుకున్నా.. కప్పు టీకి ప్రాధాన్యత ఇస్తారు. గ్రామం… పట్టణం.. ఇలా అన్ని చోట్లు చాయ్ ప్రియులు ఎక్కువగానే ఉంటారు. ఉదయం.. సాయంత్రం టీ లేకుండా ఉండడం ఎవరు ఇష్టపడరు. అంతగా చాయ్ ప్రియులు మన చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో చాయ్ తాగితే ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే కలిగే నష్టాలేంటో తెలుసుకుందామా.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన ఉత్సాహంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నిజానికి పూర్తిగా ఇది అవాస్తవం. ఉదయాన్నే టీ తాగడం వలన రోజంతా అలసటగా ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి.. చిరాకును కలిగిస్తుంది. అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన వికారంగా ఉంటుంది. నరాల సమస్య మొదలవుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వలన పొట్టలో ఉండే మంచి బాక్టీరియా దెబ్బతింటుంది. దీంతో జీర్ణ వ్యవస్థపై అధిక ప్రభావం చూపుతుంది. కాబట్టి ఉదయాన్నే టీ తాగడం మానుకోవాలి.
ఉదయాన్నే టీ తాగడం వలన యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. శరీరంలో నీరు లేకపోవడం.. డీహైడ్రేషన్ సమస్య కలగడం జరుగుతుంది. వీటన్నింటితోపాటు.. ఉదయం ఖాళీ కడపుతో టీ తాగడం వలన ఎసిడిటీ, నోటి దుర్వాసన కూడా కలుగుతాయి. కాబట్టి ఖాళీ కడుపుతో టీ అస్సలు తాగకూడదు.