వైవాహిక జీవితం నుంచి విడిపోయిన తర్వాత తన కెరీర్ పై పూర్తి దృష్టి సారించింది తెలుగు స్టార్ హీరోయిన్ సమంత. తెలుగుతో పాటు తమిళ ప్రాజెక్టులపైనా ఆసక్తి చూపిస్తోంది. తాజాగా కార్తీ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో సమంత నాయికగా అవకాశం దక్కించుకుంది. కార్తీ సోదరుడు సూర్యతో సమంత సినిమాలు చేసింది కానీ…కార్తీ సమంత కలిసి నటించడం ఇదే తొలిసారి. గతంలో ‘బ్యాచ్లర్’ అనే చిత్రాన్ని రూపొందించి తమిళ చిత్ర పరిశ్రమను ఆకట్టుకున్న దర్శకుడు సతీష్ సెల్వకుమార్ కార్తీ సమంత సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. ఇక సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే పౌరాణిక చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు ‘యశోద’ అనే నాయిక ప్రధాన చిత్రంలోనూ నటిస్తోంది.