మాఘ మాసం బుధవారం నుంచి ఆరంభమవుతోంది. శూన్యమాసం తరువాత ముహూర్తాలు ఉండడంతో శుభకార్యాలకు సిద్ధం అవుతున్నారు. మరోపక్క మూడో దశ కరోనా ముప్పు ఉండడంతో నిబంధనలు తప్పక పాటించాల్సిన పరిస్థితి. తూర్పులో వివాహాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆహ్వానితుల సంఖ్య, భోజనాలు ఏర్పాటు, వేదికలు, కల్యాణ మండపాల్లో కిక్కిరిసే పరిస్థితులపై అధికార యంత్రాంగం హెచ్చరికల మాటెలా ఉన్నా.. నిర్వాహకులు చైతన్యంతో, బాధ్యతగా భావించి తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు .
** 20 రోజులు …
ఫిబ్రవరి 2 , 3 , 5 , 6 , 7 , 10 , 11 , 14 , 17 , 19 తేదీల్లో మంచి ముహుర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు . ఇప్పటికే చాలామంది తమ ఇళ్లలో శుభకార్యాలకు నిర్ణయించారు . ఈ ముహూర్తాలు దాటితే మళ్లీ ఏప్రిల్లోనే మంచిరోజులుంటాయని పురోహితులు అంటుండడంతో త్వరపడుతున్నారు .
1. గురుభ్యోనమః
గురువారం, ఫిబ్రవరి 3, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిరఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:విదియ ఉ8.38వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:శతభిషం రా7.29వరకు
యోగం:పరిఘము రా12.23 వరకు
కరణం:కౌలువ ఉ8.38 & తైతుల రా8.09
వర్జ్యం:రా1.50 – 3.26
దుర్ముహూర్తం:ఉ10.21 – 11.06 &
మ2.51 – 3.36
అమృతకాలం: మ12.26 – 2.00*
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:మ6.00 -7.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం: 6.36
సూర్యాస్తమయం:5.51
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
*చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 03న*
* సంఘటనలు *
*1925:* భారతదేశం తన మొదటి ఎలక్ట్రిక్ రైలు సేవలను ప్రారంభించింది.
*1928:* సైమన్ కమిషన్ రాక. భారతదేశ రాజ్యాంగ సంస్కరణసూచించే బాధ్యతనిర్వహించు నిమిత్తము ఇంగ్లండులో నెలకొలపబడిన రాజ్యాంగ వ్యవస్థ.
* జననాలు *
*1468:* అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్‌బర్గ్ జననం.
*1816:* రామ్ సింగ్ కుకా, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించిన భారతీయుడు
*1906:* జార్జ్ ఆడమ్సన్, భారతీయ-ఆంగ్ల రచయిత మరియు కార్యకర్త
*1923:* నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి.
*1938:* వహీదా రెహమాన్, భారతీయ సినీ నటి.
*1957:* దీప్తి నావల్, భారతీయ నటి
*1963:* రఘురామ్ రాజన్, భారతీయ ఆర్థికవేత్త
*1992:* గురుప్రీత్ సింగ్ సంధు, ఇండియన్ అసోసియేషన్ ఫుట్‌బాల్ ప్లేయర్
*1996:* ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి.
*మరణాలు*
*1924:* అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్.
*1969:* సిఎన్ అన్నాదురై, భారతీయ పాత్రికేయుడు మరియు రాజకీయ నాయకుడు (మద్రాసు 7వ ముఖ్యమంత్రి)
*1975:* విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873)
*1984:* రవీంద్ర మాత్రే, భారత దౌత్యవేత్త
*2002:* కె. చక్రవర్తి, సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)
*2012:* రాజ్ కన్వర్, భారతీయ దర్శకుడు, నిర్మాత మరియు స్క్రీన్ రైటర్
*2012:* స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో. (జ.1960)
*2016:* బలరామ్ జాఖర్, భారతీయ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు (మధ్యప్రదేశ్ 23వ గవర్నర్) (జ.1923)
2.卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐
*గురువారం, ఫిబ్రవరి 3, 2022*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – శిశిరఋతువు*
*మాఘ మాసం – శుక్ల పక్షం*
తిధి : *విదియ* ఉ8.38వరకు
వారం : *గురువారం* (బృహస్పతివాసరే)
నక్షత్రం: *శతభిషం* రా7.29వరకు
యోగం: *పరిఘము* రా12.23 వరకు
కరణం: *కౌలువ* ఉ8.38 & *తైతుల* రా8.09
వర్జ్యం: *రా1.50 – 3.26*
దుర్ముహూర్తం : *ఉ10.21 – 11.06* &
*మ2.51 – 3.36*
అమృతకాలం: *మ12.26 – 2.00*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండ/కేతుకాలం: *మ6.00 – 7.30*
సూర్యరాశి: *మకరం* || చంద్రరాశి: *కుంభం*
సూర్యోదయం: *6.36* || సూర్యాస్తమయం: *5.51*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు
3. ఆలయ కొలనులో నెమలి విగ్రహం?
పెరంబూర్ స్థానిక మైలాపూర్ కపాలీశ్వర స్వామి ఆలయంలో అదృశ్యమైన పురాతన నెమలి విగ్రహం ఆలయ కొలనులో దాచారా? అనే కోణంలో విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఆలయంలోని పున్నైవన్ నాధర్ సన్నిధిలో ఉన్న పురాతన నెమలి విగ్రహాన్ని మార్చి, నకిలీ విగ్రహం ఏర్పాటుచేసినట్లు కేసు నమోదైంది. విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక పోలీసు విభాగం, హిందూ దేవాదాయ శాఖలు ఆరు వారాల్లో సమగ్ర విచారణ ముగించి నివేదిక దాఖలుచేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో, ఆలయ కొలనులో విగ్రహం దాచారా? అనే కోణంలో విచారణ చేపట్టిన అధికారులు, అగ్నిమాపక శాఖ సహాయంతో కొలనులో గాలించే విషయమై చర్చిస్తున్నట్లు సమాచారం.
4. రెండోరోజు కొనసాగుతున్న సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు
రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు రెండో రోజు గురువారం ముచ్చింతల్‌లో జరుగుతున్నాయి. ఇవాళ యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాలలో హోమం జరుగుతుంది. ఈ హోమాన్ని ఐదు వేల మంది రుత్వికులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సహస్రాబ్ది వేడుకలు 12 రోజులపాటు సాగనున్నాయి. ఈ వేడుకలకు 7 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. 45 ఎకరాల విస్తీర్ణంలో రూ.12 వేల కోట్లతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మాణం చేశారు.
5. ఘనంగా ‘గుడిమెలిగె’.. మొదలైన మేడారం జాతర సందడి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సన్నిధిలో గుడిమెలిగె పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజారులు సమ్మక్క గుడిని శుభ్రం చేశారు. పూజారుల ఆడపడుచులు అమ్మవారి శక్తిపీఠం గద్దెను పవిత్ర పుట్టమట్టితో అలికి పసుపు, కుంకుమతో అలంకరించారు. రంగవల్లికలు వేశారు. పూజారులు అడవి నుంచి తీసుకొచ్చిన ఎట్టిగడ్డిని సమ్మక్క గుడి ఈశాన్య దిశలో కొక్కర కృష్ణయ్య చేతుల మీదుగా పెట్టారు. గుడిమెలిగె పండుగతో మహాజాతరకు నాంది పలికారు. కాగా, సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం మేడారానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
6. టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించాలి
తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) రిజిస్ట్రేషన్‌ను తక్షణమే పునరుద్ధరించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో బుధవారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. టీటీడీ చేపట్టే వివిధ సామాజిక, విద్య, ధార్మిక, సాంస్కృతిక కార్యకలాపాల నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయవలసి వస్తుందని, శ్రీవారి ఆలయాన్ని సందర్శించే భక్తులతోపాటు విదేశాల్లోని భక్తులు ఇచ్చే విరాళాల సాయంతో టీటీడీ ఈ కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు.
7. స్వర్ణ గోపురం నిర్మాణం కోసం కిలో బంగారం ఇచ్చాం : హరీష్‌రావు
సిద్దిపేట నియోజకవర్గం నుంచి యాదాద్రి స్వర్ణ గోపురం నిర్మాణం కోసం కిలో బంగారం ఇచ్చామని మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. మరో కిలో బంగారం త్వరలోనే అందిస్తామన్నారు. యాదాద్రి గోపురం బంగారు తాపడం కోసం దాతలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారనే నమ్మకం ఉందన్నారు.