* రిలయన్స్ ఆధీనంలోని జియో నెట్‌వర్క్ ఫ్యూచర్ టెక్నాలజీపై ఫోకస్ చేసింది. దేశంలో తనకున్న కస్టమర్ బేస్‌కి ఎప్పటికప్పుడు కొత్త సేవలు అందించేందుకు వీలుగా వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంపెనీ టూలో 15 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. టూ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెటావర్స్, వెబ్ 3.0, మెషిన్ లెర్నింగ్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తోంది. ముఖ్యంగా నిర్మాణ రంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే టెక్నాలజీపై పని చేస్తోంది. దీంతో రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా జియో టూలో భారీ ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. టీ టీమ్ పని తీరు పట్ల నమ్మకం, ఎంచుకున్న రంగంలో వారు చేస్తున్న కృషిని చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నట్టు జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలిపారు. జియోతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని. తమ భాగస్వామ్యంలో సరికొత్త ఉత్పత్తులు భవిష్యత్తులో వెలుగు చూస్తాయని టూ సీఈవో ప్రనవ్ మిస్త్రీ తెలిపారు.
*క్రిప్టో కరెన్సీల ఆదాయంపై విధించే పన్నుపై ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. క్రిప్టో కరెన్సీల వంటి డిజిటల్ ఆస్తుల ఆదాయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తాజా బడ్జెట్‌లో 30 శాతం పన్ను విధించారు.
*ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్‌ఆర్‌ఎల్) రుణాల వసూళ్లపై రుణదాతలకు ఎటూ పాలుపోవడం లేదు. తమ రుణాల వసూలుకు వీలుగా ఎఫ్‌ఆర్‌ఎల్ ఆస్తులను వేలం ద్వారా అమ్మేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరా యి. ఎఫ్‌ఆర్‌ఎల్ చెల్లించాల్సిన రూ.8,000 కోట్ల నుంచి రూ.9,000 కోట్ల రుణాలు ఇప్పటికే మొండి బకాయులుగా మారిన విషయాన్ని రుణదాతలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. ఈ కేసు వెంటనే తేలకపోతే తాము మరింత తీవ్రంగా నష్టపోతామని తెలిపాయి.
*స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో రూ.283.5 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం సవరించిన అంచనా (దాదాపు రూ.100 కోట్లు) కన్నా చాలా అధికం.
*గొలుసుకట్టు డయాలసిస్ కేంద్రాల నిర్వహణ సంస్థ నెఫ్రోప్లస్.. మరింత మెరుగైన సేవలు అందించేందుకు కొత్తగా రెండు యాప్‌లను విడుదల చేసింది. డయాలసిస్ అవసరమైన మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల కో సం పేషెంట్ యాప్‌ను, నెఫ్రాలజిస్టుల కోసం నెఫ్రాలజిస్ట్ యాప్‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్‌తోపాటు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్‌లోనూ వినియోగించుకోగలిగిన ఈ యాప్‌లు పేషెంట్ల ఆరోగ్య చరిత్ర, డయాలసి్‌సకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది.
*కొవిడ్-19 ఔషధం ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్రధారి అయిన డాక్టర్ డ్రూ వైజ్‌మన్‌కు 2022 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు లభించింది.
*కోరమాండల్ ఇంటర్నేషనల్.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.379 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (రూ.326 కోట్లు)తో పోల్చితే లాభం 16.2 శాతం వృద్ధి చెందింది.
*హెల్త్‌కేర్ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న ఈక్లాట్ హెల్త్ సొల్యూషన్స్.. తెలంగాణలో తన కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ సీఈఓ కార్తీక్ పోల్సానీతో పాటు మరికొందరు కంపెనీ ప్రతినిధులు గురువారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు.
*ఎయిరిండియా ప్రయాణికులకు టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ప్రత్యేక సందేశం పంపారు. దీన్ని కొన్ని ఎయిర్ ఇండియా విమానాల్లో వినిపిస్తున్నారు. రతన్ టాటా సందేశంతో కూడిన 19 సెకన్ల నిడివి కలిగిన వీడియోను బుధవారం ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. ‘‘ఎయిరిండియా నూతన ప్రయాణికులకు టాటా గ్రూప్ స్వాగతం పలుకుతోంది. ప్రయాణికుల సౌకర్యం, సేవల పరం గా ఎయిర్ ఇండియాను మీ తొలి ఎంపికగా చేసేలా కలిసి పని చేయడానికి ఉత్సాహంగా ఉంది’’ అని రతన్ టాటా పేర్కొన్నారు. ఇటీవలే ఎయిర్ ఇండియా అధికారికంగా టాటా గ్రూప్ చేతికి వెళ్లిన విషయం తెలిసిందే. మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విత్త లోటు 6.9 శాతం ఉండవచ్చని అంచనా. అయితే తుది గణాంకాలు వచ్చే నాటికి పన్ను వసూళ్లు పెరిగితే ఇది కొంతమేరకు తగ్గవచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి విత్త లోటు లక్ష్యం 6.4 శాతంగా ప్రకటించారు. 2025-26 నాటికి విత్తలోటు జీడీపీలో 4.5 శాతానికి కుదించాలంటూ గత బడ్జెట్‌లో తాను చేసిన కన్సాలిడేషన్ ప్రణాళికకు లోబడే ఈ అంచనాలున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు. రూపాయి విలువ ప్రకారం విత్తలోటు 2021-22 సవరించిన అంచనాల ప్రకారం రూ.15,91,089 కోట్లుం టే 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.16,61,196 కోట్లుంటుందని ఆమె చెప్పారు.