ఇటీవల బికినీతో మాల్దీవుల్లో అందాల ఆరబోతతో హల్‌చల్ చేసిన పూజాహెగ్డే ఒక్కసారిగా సంప్రాదాయ దుస్తుల్లో పూజలు నిర్వహిస్తూ కనిపించింది. కొన్నాళ్ల క్రితం ఆమె ముంబైలో ఓ భవంతి కొనుగోలు చేసి తనకు నచ్చినట్లు ఇంటీరియర్ చేయించుకున్నారు. తాజాగా ఆమె ఆ ఇంట్లో అడుగుపెట్టారు పూజా. పూజలు చేస్తున్న ఫొటోలను పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఇల్లు కట్టుకోవాలన్న నా కల నెరవేరింది. మీరు మీ అంతరాత్మను, శ్రమను నమ్ముతూ ఉండండి. ఈ వరల్డ్ మీతో ప్రేమలో పడుతుంది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె కథానాయికగా నటించిన ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’ చిత్రాలు విడులకు సిద్ధంగా ఉన్నాయి.