గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని, బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆస్తులను భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి బదలాయించారు. ముంబైలోని జుహులో ఉన్న తన ఇల్లు, అపార్ట్‌మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్ వ్యూ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లు ఉన్నాయి.వీటి విస్తీర్ణం 5,995 చదరపు అడుగులు కాగా దీని మొత్తం విలువ రూ.38.5 కోట్లు. జనవరి 21న శిల్పాశెట్టి స్టాంప్ డ్యూటీ కింద రూ.1.9 కోట్లు చెల్లించగా ఈ లావాదేవీల వివరాలను జప్‌కే డాట్ కామ్ వెల్లడించింది. తన పేరిట ఉన్న ఆస్తులను రాజ్‌కుంద్రా భార్య శిల్పాశెట్టి పేరిట ఎందుకు మార్చారనే వివరాలు తెలియాల్సి ఉంది.